ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. 1996 నుంచి 2001 వరకు తాలిబన్ల దురాక్రమణలో ఆఫ్ఘనిస్తాన్ అతలాకుతలం అయింది. 2001 నుంచి 2021 వరకు ప్రజాస్వామ్య పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మరోసారి తాలిబన్ల వశం అయింది. దీంతో ఇప్పుడు మరలా తాలిబన్ల గురించి ప్రపంచం భయపడుతున్నది. ఆందోళన చెందుతున్నది. 1990లో తాలిబన్ల వ్యవస్థ ఏర్పాటైంది. గిరిజనుల హక్కుల పోరాటం కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు తాలిబన్ల వ్యవస్థను 1990లో ఏర్పాటు చేశారు. మసీదులో నలుగురు వ్యక్తుల ఆలోచనల నుంచి వచ్చిందే ఈ తాలిబన్ వ్యవస్థ. మంచి కోసం ఏర్పాటైన తాలిబన్… 1996లో అధికారంలోకి వచ్చిన వెంటనే షరియా చట్టాలను అమలు చేయడం మొదలుపెట్టింది. ఏ ప్రజలకోసమైతే అధికారంలోకి వచ్చిందో, ఆ ప్రజలను హింసించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి తాలిబన్ అంటే ప్రజలు భయపడిపోతున్నారు.
Read: ఆఫ్ఘాన్ బార్బర్లకు టైటానిక్ భయం… ఎందుకో తెలుసా…!!