అందంగా ఉన్నాయి… బొమ్మ‌ల్లా ఉన్నాయ‌ని ద‌గ్గ‌ర‌కెళ్లారో… ఇక అంతే…

చూసేందుకు చాలా అందంగా ఉన్నాయి… బొమ్మ‌ల్లా కనిపిస్తున్నాయ‌ని పొర‌ప‌డి ద‌గ్గ‌ర‌కు వెళ్తే… బుస్‌మ‌ని బుస‌కొడుతూ ముందుకు వ‌స్తున్నాయి.  ఇప్ప‌టికే అర్ధం అయ్యింది క‌దా… దేని గురించి తెలుసుకోబోతున్నారో.   మ‌హారాష్ట్రలోని అమ‌రావ‌తి హ‌రిసాల్  అట‌వీ ప్రాంతంలో ఓ మూడు న‌ల్ల త్రాచులు క‌నిపించాయి.  అడ‌విలోని ఓ చెట్టు మొద్దుకు మూడు న‌ల్ల‌తాచు పాములు చుట్టుకొని ప‌డ‌గ‌విప్పి క‌నిపించాయి.  

Read: నిరాశ‌ప‌రిచిన పేటీఎం… తొలిరోజే…ఢ‌మాల్‌…

ఇలా అడ‌విలో పాములు క‌నిపించ‌డంతో భ‌య‌ప‌డిన స్థానికులు అట‌వీశాఖాధికారుల‌కు స‌మాచారం అందించారు.  అడ‌విలో క‌నిపించిన ఆ మూడు పాముల‌ను ఫొటోగ్రాఫ‌ర్ రాజేంద్ర సేమాల్క‌ర్ అనే వ్య‌క్తి ఫొటోలు తీసి ఇండియ‌న్ వైల్డ్ లైఫ్‌లో పోస్ట్ చేశారు.  ఆ ఫొటోల‌ను అట‌వీశాఖ అధికారి సుశాంత‌నంద ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌గా ఒక్క‌సారిగా వైర‌ల్ అయ్యాయి.  చూసేందుకు ఆ మూడు పాములు చాలా అందంగా బొమ్మ‌ల్లా క‌నిపిస్తున్నాయి.  ఆ అందానికి ముగ్ధులై ముందుకు వెళ్తే… కాటికి పోవాల్సిందే అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

Latest Articles