తెలుగు అకాడమీ స్కాం: ప్లాన్ చేసి.. పద్దతిగా కాజేసిన క్రమం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. స్కామ్ కు పాల్పడ్డ ముఠాలోని పది మందిని అరెస్ట్ చేశారు. కేసులో పది మందిని ముద్దాయిలుగా పేర్కొన్నారు పోలీసులు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్‌వలీతో కుమ్మక్కై తెలుగు అకాడమీ డిపాజిట్లను నిందితులు కాజేశారు. ఈ ఏడాది జనవరి నుంచి స్కామ్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కమీషన్ ఎర చూపించి.. బ్యాంక్, అకాడమీ సిబ్బందిని ముగ్గులోకి దింపారు నిందితులు. గతంలోనూ ఈ ముఠా పలు స్కామ్‌లకు పాల్పడినట్లు తెలుస్తోంది.
సాయి కుమార్..
Also Read
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
తెలుగు అకాడమీ స్కాంలో కీలక నిందితుడు సాయికుమార్ అని పోలీసులు పేర్కొన్నారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఫిక్స్డ్ డిపాజిట్లను సాయికుమార్ కొట్టేశాడు.. ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ బోర్డ్ సంబంధించిన ఆరు కోట్ల రూపాయలను సాయికుమార్ కొట్టేశాడు. ఈ స్కాంపైన సీబీఐలో కూడా 2015 కేసు నమోదు అయింది. చెన్నైలోని నార్తరన్ కోల్ ఫీల్డ్ కు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లను సాయికుమార్ కొట్టేశాడు. 25 కోట్ల రూపాయల గోల్ మాల్ పై సీబీఐ కేసు నమోదు అయింది. ఏడాది క్రితం నుంచే తెలుగు అకాడమీ నిధులను కొట్టాలని సాయికుమార్ ప్లాన్ చేశారు. వెంకట రమణతో కలిసి సాయికుమార్ ప్లాన్ చేశాడు. రాజ్ కుమార్ ను బ్యాంకు అధికారి పేరుతో అకాడెమీకి సాయికుమార్ పంపించాడు. రాజ్ కుమార్ ని బ్యాంకు ఉద్యోగం నమ్మి అకాడెమీ సంబంధించిన చెక్కులు రమేష్ అందజేశాడు. రమేష్ ఇచ్చిన చెక్ లతో పాటుగా అకాడమీ లెటర్స్ ని నకిలీ తయారుచేశాడు సాయికుమార్.. సంవత్సరానికి fd లను 15 రోజులకే పెట్టి సర్టిఫికెట్లు తీసుకొని సాయి కుమార్.. ఒరిజినల్ సర్టిఫికెట్లను సాయికుమార్ దగ్గర పెట్టుకొని నకిలీ fd లను రమేష్ కు ఇచ్చిన సాయికుమార్ . నకిలీ fd లను చూసుకోకుండానే అకౌంట్ సిబ్బంది భద్రపరిచింది. పదిహేను రోజుల తర్వాత fd లను విత్ డ్రా చేసిన సాయి కుమార్.. అంతకంటే ముందే అగ్రి సేన్ బ్యాంకుతో పాటు ఏపీ సొసైటీలో తెలుగు అకాడమీ పేరుతో నకిలీ అకౌంట్లను సాయికుమార్ తెరిచాడు. యూనియన్ బ్యాంక్ తో పాటుగా కెనరా బ్యాంకు నుంచి డబ్బులు విత్ డ్రా లెటర్ ఇచ్చిన సాయికుమార్. డ్రా చేసిన డబ్బులను సాయికుమార్ బ్యాంకు మళ్లించాడు. అగ్రసేన్ బ్యాంక్ నుంచి సొసైటీకి తరలించిన సాయికుమార్. సొసైటీ నుంచి 64 కోట్ల రూపాయలు సాయికుమార్ డ్రా చేశాడు. డ్రా చేసిన డబ్బులు 6 కోట్లు అందరికీ పంచగా.. మిగతా ఆరు కోట్లు అకౌంట్స్ అధికారి రమేష్ కి పంపినట్టుగా గుర్తించారు.
మస్తాన్ వలీ.. యూనియన్ బ్యాంక్ మేనేజర్
అకాడమీ డబ్బులు అత్తారింట్లో కీలక పాత్ర పోషించిన మేనేజర్ సాయికుమార్ అండ్ గ్యాంగ్ తో మస్తాన్ వలీ చేతులు కలిపారు. యూనియన్ బ్యాంకు జారీ చేసిన fd లను విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చినా మస్తాన్ వలీ. కార్వాన్, సంతోష్ నగర్ యూనియన్ బ్యాంకు మేనేజర్ గా మస్తాన్ వలీ పనిచేశాడు.. రెండు బ్యాంకుల నుంచి 55 కోట్ల రూపాయలను అగ్రసేన్ బ్యాంకు బదిలీ చేసేందుకు మస్తాన్ వలి అనుమతించాడు. సాయి కుమార్ ఇచ్చిన నకిలీ పత్రాలతో డబ్బులను బదిలీ చేసిన మస్తాన్ వలీ. డబ్బులను అగ్రసేన్ బ్యాంకు తరలించేందుకు పెద్ద మొత్తంలో సాయి కుమార్ లంచాలను ఇచ్చాడు.
రమేష్.. అకాడమీ చీఫ్ అకౌంటెంట్ అధికారి
ఫిక్స్డ్ డిపాజిట్లను పర్యవేక్షించే అధికారిగా రమేష్ వున్నారు.. రమేష్ చేతుల మీదుగానే అకాడమి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం నడుస్తుంది. డబ్బులు జమా ఖర్చులు మొత్తం కూడా రమేష్ చూసుకుంటారు. బ్యాంకు అధికారుల పేరుతో వచ్చిన రాజ్ కుమార్ ను రమేష్ గుడ్డిగా నమ్మారు. రాజ్ కుమార్ గత ఏడాది కాలం నుంచి సంబంధించిన చెక్కులు తో పాటు అధికారిక లెటర్స్ ఇచ్చిన రమేష్. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత పర్యవేక్షణ లేకుండా రమేష్ నిర్లక్ష్యం వహించాడు. రాజకుమార్ చేసిన నకిలీ fd లను చుసుకోకుండా రమేష్ భద్రపరిచారు. బ్యాంకులో డబ్బులు డిసెంబర్ నుంచి విత్ డ్రా అవుతున్నప్పటికీ రమేష్ పట్టించుకోలేదు. ఇటీవల కాలంలో ఆంధ్రాకి డబ్బులు పంపకాలు చేసే సమయంలో స్కాం బయటపడ్డది. రమేష్, రాజ్ కుమార్ ,సాయికుమార్ లు కలిసి నిధుల మళ్లింపు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. రమేష్ నిర్లక్ష్యానికి 64 కోట్ల రూపాయల డిపాజిట్లు దారి మళ్లినట్లు నివేదిక పొందుపరిచారు.
సత్యనారాయణ.. ఆంధ్రప్రదేశ్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కేంద్రంగా ఈ సొసైటీ పని చేస్తుంది. దీనికి సత్యనారాయణ రాజు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సొసైటీ ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించి వ్యాపారం నిర్వహిస్తుంది. ఈ సొసైటీలో సాయికుమార్ తెలుగు అకాడమీ పేరుతో నకిలీ అకౌంట్లను తెరిచారు. సంవత్సరం క్రితమే సాయికుమార్ బ్యాంకు అకౌంట్ ను తెరిచాడు. అకౌంట్ తెరవడానికి ముందే సత్యనారాయణతో కుమ్మక్కైయ్యాడు. అగ్ర సేన్ బ్యాంకు నుంచి నిధులు వస్తాయని వాటిని డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సాయి కుమార్ ముందే చెప్పాడు. 64 కోట్ల రూపాయల నిధులను డ్రా చేసుకున్నందుకు కమిషన్ రూపంలో సాయి కుమార్ డబ్బులు ఇచ్చాడు. సత్యనారాయణకు సొసైటీ మేనేజర్ పద్మావతి సహకరించింది.
సాధన.. కెనరా బ్యాంక్ మేనేజర్
తెలుగు అకాడమీ డిపాజిట్ చేసిన డబ్బులను సాధన అగ్రసేన్ బ్యాంకు బదిలీ చేశారు. తెలుగు అకాడమీ పేరుతో అగ్రసేన్ బ్యాంక్ లో ఉన్న నకిలీ అకౌంట్ కి సాధన డబ్బులు ఇచ్చారు. నకిలీ అకౌంట్ అని తెలిసిన అగ్రసేన్ బ్యాంకు డబ్బులు ఇచ్చింది సాధన. డబ్బులను బ్యాంకు మళ్ళించేందుకు పెద్ద మొత్తంలో సాయి కుమార్ నుంచి కమిషన్ సాధన తీసుకొంది.
– Ramesh Vaitla









తాజావార్తలు
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?