చూసేందుకు చాలా అందంగా ఉన్నాయి… బొమ్మల్లా కనిపిస్తున్నాయని పొరపడి దగ్గరకు వెళ్తే… బుస్‌మని బుసకొడుతూ ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే అర్ధం అయ్యింది కదా… దేని గురించి తెలుసుకోబోతున్నారో. మహారాష్ట్రలోని అమరావతి హరిసాల్ అటవీ ప్రాంతంలో ఓ మూడు నల్ల త్రాచులు కనిపించాయి. అడవిలోని ఓ చెట్టు మొద్దుకు మూడు నల్లతాచు పాములు చుట్టుకొని పడగవిప్పి కనిపించాయి.
Read: నిరాశపరిచిన పేటీఎం… తొలిరోజే…ఢమాల్…
ఇలా అడవిలో పాములు కనిపించడంతో భయపడిన స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. అడవిలో కనిపించిన ఆ మూడు పాములను ఫొటోగ్రాఫర్ రాజేంద్ర సేమాల్కర్ అనే వ్యక్తి ఫొటోలు తీసి ఇండియన్ వైల్డ్ లైఫ్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను అటవీశాఖ అధికారి సుశాంతనంద ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. చూసేందుకు ఆ మూడు పాములు చాలా అందంగా బొమ్మల్లా కనిపిస్తున్నాయి. ఆ అందానికి ముగ్ధులై ముందుకు వెళ్తే… కాటికి పోవాల్సిందే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.