వ్యవసాయ చట్టాలపై విజయం ఎవరిది !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు ఉద్యమాన్ని రగిల్చిన వ్యక్తి. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో ముందున్న వ్యక్తి. ఆయనే రాకేష్ టికాయత్. ఇకపైన రైతుల సమస్యల పోరాటం కొనసాగుతుందని.. విశ్రమించ బోమంటున్నా రాయన. రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే అందరికి గుర్తుకొచ్చే పేరు రాకేష్ టికాయత్. భారత కిసాన్ యూనియన్ నేత. రైతులకు శాపంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. అన్నదాతలు నడిపిన ఆందోళనలకు నాయకత్వం వహించారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని వీధుల్లో ఉద్యమాన్ని రగిల్చాడు. ఢిల్లీ బార్డర్ సింఘు నుంచి మొదలుకుని అనేక రాష్ట్రాల్లో పర్యటించి సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులను ఏకం చేశారు రాకేష్ టికాయత్. కేంద్రం అనేక సార్లు చర్చలు జరిపినా.. డిమాండ్ల విషయంలో రాజీ పడకుండా పోరాటం కొనసాగించారు. అన్నదాతలు నెలలపాటు చలిలోనే మగ్గుతూ.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఆందోళన చేశారు.
Also Read
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
ఇప్పుడు అదే రైతుల పోరాటం కేంద్రాన్ని కదలించింది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసింది. కేంద్రం మెడలు వచ్చిన నిజమైన నాయకుడిగా టికాయత్ విజయం సాధించారు. ఇది భారత రైతుల విజయం అని అభివర్ణిస్తున్నారు టికాయత్. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నామన్న మోడీ ప్రకటనపై స్పందించారు టికాయత్. చట్టాల రద్దుపై ప్రకటన చేసినప్పటికీ తాము ఉద్యమాన్ని ఇప్పుడే విరమించబోమని తేల్చి చెప్పారు. పార్లమెంట్‌లో చట్టాలు రద్దు జరిగే రోజు వరకు వేచి చూస్తామన్నారు. అంతే కాదు కనీస మద్దతు ధరతో పాటు రైతుల ఇతర సమస్యలపై కూడా ప్రభుత్వం చర్చించాల్సి ఉందన్నారు రాకేష్ టికాయత్.
తాజావార్తలు
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?