తిరుమలలో సర్వదర్శనానికి కరోనా గ్రహణం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారిని ఉచితంగా దర్శించుకునే భాగ్యం సామాన్య భక్తులకు తిరిగి ఎప్పుడు లభిస్తుంది? సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తామనే టీటీడీ.. ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? కరోనా తీవ్రతవల్ల నిలిచిపోయిన సర్వదర్శనం తిరిగి ప్రారంభించేది ఎప్పుడు? 300ల నుంచి వీఐపీల వరకు టికెట్లు పెట్టి దర్శనం చేయిస్తున్న టీటీడీకి ఉచిత దర్శనం ఎందుకు పట్టడం లేదు? ఆదాయంపై ఉన్న ధ్యాస సామాన్య భక్తులపై లేదా?
సామాన్య భక్తులు క్యూ లైన్లో వేచి ఉంటే ఆహార పానీయాలు ఉచితం
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ఇల వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం క్యూలైన్ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి రాత్రి ఏకాంతసేవ వరకు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు సర్వదర్శనం భక్తులకు ఉంటుంది. సామాన్య భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశిస్తే.. వారికి దర్శనభాగ్యం కలిగించే వరకు అన్నీ టీటీడీయే సమకూరుస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో గంటల తరబడి భక్తులు వేచిఉంటే.. ఆ సమయంలో వారికి ఆహార పానీయాలు అన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు గతంగతః అన్నట్టుగా మారిపోయింది.
కరోనా మొదటి వేవ్‌లో 22 వేల మందికి సర్వ దర్శనం!
కరోనా వైరస్ మొదటివేవ్లో గతఏడాది మార్చి 21న శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసింది టీటీడీ. 80 రోజుల తర్వాత దర్శనాలు పునరుద్ధరించినా.. పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించింది. రోజుకి 6 వేల మంది వచ్చేలా మార్పులు చేసినా.. సర్వదర్శన భక్తులుకు ప్రాధ్యనం ఇచ్చింది. మొదట్లో 3వేల మంది ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా.. మరో 3వేల మంది సర్వదర్శనం క్యూలైను ద్వారా వెళ్లేవారు. ఆ తర్వాత భక్తుల సంఖ్యను పెంచుతూ వెళ్లింది. ఆ విధంగా ఈ ఏడాది ఏప్రిల్ 14 నాటికి స్వామివారిని దర్శించుకునే సర్వదర్శనం భక్తుల సంఖ్య 22 వేలకు చేరింది.
ఏప్రిల్ 14 నుంచి సర్వదర్శనం టికెట్ల జారీ నిలిపివేత
కరోనా సెకండ్ వేవ్‌లో దర్శనాలు ఆపకపోయినా.. భక్తుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది టీటీడీ. ఈ ప్రభావం సర్వదర్శనం భక్తులపై పడింది. ఏప్రిల్ 14 నుంచి సర్వదర్శనం భక్తులకు జారీచేసే దర్శన టోకెన్లను పూర్తిగా నిలిపివేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రోజుకు 5 వేలకు కుదించింది. అయినప్పటికీ స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 18 వేల వరకు ఉంటోంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు, వర్చువల్ సేవా , శ్రీవాణి ట్రస్ట్, పర్యాటక శాఖ జారీ చేసే టికెట్లు కలిగిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వీరంతా 300 నుంచి 10వేల రూపాయలు వరకు పెట్టి టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు. దీంతో టికెట్ల ద్వారా కోటి.. హుండీ ద్వారా మరో కోటికిపైగా ఆదాయం వస్తోంది.
సర్వదర్శనంలో భక్తులు వచ్చి 75 రోజులు దాటింది
కొండకు వచ్చే భక్తుల్లో 60-65 శాతం మంది ఉచిత దర్శనం
ప్రస్తుతం కాసులు చెల్లించిన వారికే దర్శనం. సర్వదర్శనం భక్తులు వచ్చి 75 రోజులవుతోంది. ఈ కోటాలో టికెట్లు జారీ చేస్తే కరోనా తీవ్రత పెరుగుతుందనే అనుమానంతో వాయిదా వేస్తూ వస్తోంది టీటీడీ. సాధారణంగా తిరుమల దర్శనానికి వచ్చే భక్తుల్లో 60-65 శాతం ఉచిత దర్శనం చేసుకునే వారే ఉంటారు. అలాంటిది కరోనా పేరుతో టికెట్లు కొనేవారికి ఇస్తున్న ప్రాధాన్యంలో కనీసం సగం కూడా సామాన్య భక్తులకు టీటీడీ ఇవ్వడం లేదు. కనీసం అందుకు వీలున్న ప్రత్యామ్నాయాలను కూడా పట్టించుకోవడం లేదు. మళ్లీ కరోనా థర్డ్‌వేవ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఆ సాకుతో ఇప్పుడప్పుడే సామాన్యులకు శ్రీవారి దర్శన భాగ్యం దక్కే సూచనలు కనిపించడం లేదు.
తాజావార్తలు
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!