సీఎం చెప్పిన ఆ ఇద్దరు బీజేపీ నేతలు ఎవరు…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఇద్దరు బీజేపీ నేతల పేర్లను సీఎం జగన్ ప్రస్తావించారా? ఆ ఇద్దరు బీజేపీ నేతలు ఎవరు? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? సీఎం నన్ను అన్నారంటే.. కాదు కాదు నన్నే అన్నారు అని కమలనాథులు ఎందుకు పోటీపడి చెప్పుకొంటున్నారు? ఏంటా రగడ? లెట్స్ వాచ్!
ఇద్దరు బీజేపీ నేతల పేర్లను ప్రస్తావించిన సీఎం?
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
ఏపీ బీజేపీ నేతలను కట్టడి చేయాలని సీఎం జగన్ మంత్రులను ఇటీవల ఆదేశించారు. అఫీషియల్ అజెండా తర్వాత కేబినెట్ మీటింగ్‌లో జరిగిన రాజకీయ చర్చలో మంత్రులను ఈ విషయంలో సీఎం ప్రశ్నించారట. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన నిలదీశారట. ఈ సందర్భంగానే ఇద్దరు బీజేపీ నేతల పేర్లను ముఖ్యమంత్రి ప్రస్తావించినట్టు సమాచారం. ప్రభుత్వంపై ఆ ఇద్దరూ విమర్శలు చేస్తుంటే మంత్రులు ఎందుకు ఘాటుగా తిప్పికోట్టడం లేదని అడిగారట. పైగా బీజేపీ విషయంలో మరీ ఆచితూచి వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రులకు సీఎం పరోక్షంగా స్పష్టం చేశారట.
ఒకటి వీర్రాజు పేరు.. రెండోది ఎవరు?
కేబినెట్ సమావేశంలో సీఎం ప్రస్తావించిన ఆ ఇద్దరు నేతలు ఎవరన్నది బీజేపీలో చర్చగా మారింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. పార్టీ కోఇంచార్జ్ సునీల్ దేవధర్ పేర్లను సీఎం ప్రస్తావించారని కొందరు చెబుతున్నారట. వీర్రాజుతోపాటు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి పేర్లను ఉటంకించారన్నది మరికొందరి వాదన. ఒక పేరు సోము వీర్రాజు అని ఖరారైనా.. రెండోది ఎవరన్నదే కమలనాథులకు తేలడం లేదట. పైగా కేబినెట్ సమావేశంలో తమ పేర్లను సీఎం ప్రస్తావించడాన్ని అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నారట బీజేపీ నేతలు. దీంతో ముఖ్యమంత్రి మమ్మల్ని అన్నారంటే మమ్మల్ని అన్నారని చెప్పుకోవడంలో పోటీ పడుతున్నారు కమలనాథులు.
సీఎం స్పందిస్తే బీజేపీ నేతల లక్ష్యం నెరవేరినట్టేనా?
అధికారపక్షం గుర్తిస్తే.. స్వపక్షంలో గుర్తింపు లభించినట్టేనా?
కార్యక్రమం ఏదైనా ఈ మధ్య వైసీపీని టార్గెట్ చెయ్యడంలో బీజేపీ జోరు పెంచింది. అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాలు కావచ్చు లేక.. హైకమాండ్ దృష్టిలో పడే ప్రయత్నం కావచ్చు.. దూకుడు పెంచారు నాయకులు. ఇదే సందర్భంలో తాము మాట్లాడింది.. తెరపైకి తెచ్చిన అంశాలు కూడా అందరి దృష్టిలో పడాలి అనుకుంటున్నారట. సీఎం లాంటి వారు తమ ఆరోపణలు, కార్యక్రమాలకు స్పందిస్తే తమ లక్ష్యం నెరవేరినట్టేనని భావిస్తున్నారట. కేబినెట్ మీటింగ్‌లో సీఎం చేసిన కామెంట్స్‌పై బీజేపీ నేతలు ట్విటర్లో, పార్టీ వేదికలపైనా ఇప్పటికే స్పందించారు. అయితే రెండో నేత ఎవరో అంతుచిక్కడం లేదట. అధికారపక్షంలో ఇలా తమను గుర్తిస్తేనే.. స్వపక్షంలో గుర్తింపు లభిస్తుందని భావించారో ఏమో.. కమలనాథుల్లో మాత్రం ఆరాటం కనిపిస్తోందని టాక్.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!