రెండు వరస ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయారు. రాజకీయ భవిష్యత్ కోసం.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పంచన చేరారు. అక్కడా కుదురుకోలేని పరిస్థితి. ఇంతలో పీసీసీ చీఫ్‌గా రేవంత్ రావడంతో ఘర్‌వాపసీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే ఆ జిల్లా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
బీజేపీలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలు రేవంత్‌తో టచ్‌లో ఉన్నారా?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడంతోపాటు పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రావడంతో మంచిరోజులు వచ్చాయని భావిస్తున్నారట. ఇదే సమయంలో గతంలో రేవంత్‌రెడ్డితో కలిసి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి.. ఇమడలేక బీజేపీలోకి వెళ్లినవారు పునరాలోచనలో పడ్డారట. తిరిగి వచ్చేస్తామని రేవంత్‌తో టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.
బీజేపీకి బోడ జనార్దన్ గుడ్‌బై చెప్పేస్తారా?
ఉమ్మడి జిల్లాకు చెందిన ఒకరిద్దరు నాయకులు ఇప్పటికే రేవంత్ దగ్గరకు వెళ్లి పూలబొకేలు ఇచ్చి వచ్చారు. చెన్నూరుకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్ సైతం పీసీసీ చీఫ్‌ను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో జనార్దన్‌కు పడటం లేదనే టాక్ ఉంది. ఆ మధ్య వివేక్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశానికి కూడా వెళ్లారాయన. దీంతో జనార్దన్ బీజేపీకి గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైందని చెబుతున్నారు.
మాజీ మంత్రి వినోద్ కూడా రేవంత్‌తో మాట్లాడారా?
రేవంత్‌ను కలిసిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తనయుడు రితేష్
కాంగ్రెస్ నుంచి బీఎస్పీలోకి వెళ్లిన మాజీ మంత్రి వినోద్ కూడా పీసీసీ చీఫ్‌ను కలిసినట్టు చెబుతున్నారు. బీజేపీ నేత రావి శ్రీనివాస్ సైతం కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. నిన్న మొన్నటి వరకు పార్టీ మారతారని ప్రచారం జరిగిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్‌రావు సైతం కాంగ్రెస్‌లోనే ఉంటానని ప్రకటన చేశారు. ఇక ఇటీవలే బీజేపీ కండువా కప్పుకొన్న మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ గురించి కూడా ప్రచారం మొదలైంది. ఎప్పుడు పార్టీ మారినా కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లడం మాజీ ఎంపీకి అలవాటు. అయితే రమేష్ రాథోడ్ తనయుడు రితేష్ బీజేపీతో టచ్‌మీ నాట్‌గా ఉంటున్నారు. పైగా రేవంత్‌ను కలిసి అభినందనలు తెలియజేయడంతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. తండ్రి బీజేపీలో..తనయుడు కాంగ్రెస్‌లో కొనసాగుతారా? లేక ఇద్దరూ ఒకే కండువా కప్పుకొంటారా అన్న చర్చ జోరందుకుంది. స్థానిక పరిణామాలకు అనుగుణంగా కండువాలు మారతాయనే టాక్ స్థానికంగా వినిపిస్తోంది. రమేష్ రాథోడ్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆయనకు ఖానాపూర్ అసెంబ్లీతోపాటు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇప్పించింది రేవంతేనట. ఆ అంశాన్ని ఇప్పుడు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
పార్టీ మారి తప్పుచేశామా అని మథన పడుతున్నారా?
వీరే కాకుండా ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న నాయకుల్లో చాలామంది రేవంత్ అభిమానులు ఉన్నారట. వారంతా పార్టీ మారి తప్పు చేశామా అని మథన పడుతున్నారట. పీసీసీ చీఫ్ నుంచి సంకేతాలు రాగానే చాలా మంది వెనక్కి వచ్చేస్తారని అనుకుంటున్నారు. అయితే మళ్లీ గోడ దూకేది ఎంత మంది అన్నదే ఆసక్తిగా మారింది.