సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనా ప్రావీణ్యాన్ని నిరూపించుకున్న సోనూసూద్‌కు ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు. సినిమాలు, నటనతో పాటు, సోనూ సూద్ సామాజిక కార్యకర్తగా కూడా పనిచేస్తున్నాడు. కరోనా కష్ట కాలంలో నటుడు లక్షలాది మందికి సహాయం చేశాడు. నేటికీ పేదలకు సహాయం చేస్తున్నాడు. అందుకే ఆయనను ‘పేదల దూత’ అని కూడా పిలుస్తారు. నటుడు ఈ రోజు తన 51వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈరోజు స్టార్ యాక్టర్ అయ్యాడు. ఐశ్వర్యానికి, పేరు ప్రఖ్యాతులకు కొదవ లేదు. కేవలం ఐదు వేల రూపాయలతో ముంబయికి వచ్చాడు. కానీ, ఈరోజు ఆయనకు కోట్ల ఆస్తులు ఉన్నాయి. కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
READ MORE: CM Revanth Reddy: లక్షల మంది రైతుల ఇండ్లలో సంతోషం.. ఇది మా ప్రభుత్వ చరిత్ర..
సోనూసూద్ ప్రస్తానం..
సోనూసూద్ 1973లో ఈ రోజున జన్మించాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్న వయసులోనే ఇంటి భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. కొడుకు ఇంటి బాధ్యతలు చేపడతాడన్న ఆశతో తండ్రి కొడుకుని ఇంజినీరింగ్‌లో చేర్పించాడు. సోనూ సూద్ కూడా తన చదువును పూర్తి చేశాడు. తన పాఠశాల రోజుల్లో.. అతను 12 మంది అబ్బాయిలతో ఒక గదిలో నివసించాడు. అతని తండ్రి ఇంటి నుంచి డబ్బు పంపినప్పుడు ఆ డబ్బులో కొంత ఆదా చేసేవాడు. సోనూ సూద్ మంచి ఎత్తు, పర్సనాలిటీ కలిగి ఉన్నాడు. అందుకే అతను తన చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్‌పైపు వెళ్లాడు.
READ MORE: Viral Video Today: స్టేడియం బయట బంతి.. బాల్ ఇవ్వనని మొండికేసిన ల్యాండ్ ఓనర్! వీడియో చూస్తే నవ్వాగదు
1996 లో నటుడిని కావాలనే తన కలను నెరవేర్చుకోవడానికి ముంబై వచ్చాడు. ఆ సమయంలో అతని వద్ద రూ.5500 మాత్రమే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అతని జీవితం అంత సులభంగా సాగలేదు. లోకల్ రైలులో ప్రయాణించేవాడు. చాలా కష్టపడి 1999లో ఒక తమిళ సినిమాలో నటించే అవకాశం సంపాదించాడు. అతని నటనా జీవితం ఇక్కడ నుంచే ప్రారంభమైంది. అతను అనేక సౌత్ చిత్రాలలో నటించాడు.
READ MORE: Rajni: ఈ వయసులో కూడా రచ్చ లేపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్..ఎన్ని సినిమాలు చేస్తున్నాడో తెలుసా..?
దీని తరువాత.. సోనూ సూద్ తన మొదటి బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశాన్ని 2002 సంవత్సరంలో అందుకున్నాడు. అది ‘షహీద్-ఎ-ఆజం’. దీంతో హిందీలోకి అడుగుపెట్టి వెనుదిరిగి చూడలేదు. సోనూసూద్ విలన్‌గా, హిందీ హీరోగా సౌత్‌లో చాలా పేరు సంపాదించుకున్నాడు. నటనతో జనాల్లో మంచి ఆదరణ పెంచుకున్నాడు. ఒకప్పుడు ఐదు వేల రూపాయలు జేబులో పెట్టుకుని ముంబైకి వచ్చిన సోనూసూద్ ఈరోజు పెద్ద ఎత్తున పారితోషకం పొందుతున్నాడు. ఎంతో సంపదను, కీర్తిని సొంతం చేసుకున్నాడు. ముంబైలో ఓ విలాసవంతమైన ఇల్లు, ఎన్నో విలాసవంతమైన కార్లు, కోట్ల ఆస్తికి యజమాని అయ్యాడు.
READ MORE: Mallu Bhatti Vikramarka: రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చింది..
25 ఏళ్లలో సోనూ సూద్ ఎంత సంపాధించాడంటే…
సోనూసూద్ ఈరోజు కోట్లు సంపాదిస్తున్నాడు. సినిమాల ద్వారానే కాకుండా ప్రకటనల ద్వారా కూడా మంచి భారీగా డబ్బు సంపాదిస్తున్నాడు. రియాల్టీ షోల నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బు పొందుతున్నాడు. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్‌వాలా ప్రాంతంలో అతనికి విలాసవంతమైన భవనం ఉంది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. అతనికి లగ్జరీ కార్లంటే కూడా ఇష్టం. అతని కార్ష జాబితాలో జాబితాలో పోర్షే పనామెరా, మెర్సిడెస్-బెంజ్ ML-క్లాస్ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అతను ప్రస్తుతం ఒక చిత్రానికి దాదాపు 2-3 కోట్ల రూపాయలు వసూలు చేస్తాడు. ప్రస్తుతం సోనూసూద్ నికర విలువ రూ. 135 నుంచి 140 కోట్లు ఉంటుంది.