A Man Take Ball after Batters Hit Huge Six In TNPL 2024: టీ20 క్రికెట్ వచ్చాక బ్యాటర్లు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. హార్డ్ హిట్టర్లు బాదిన కొన్ని సిక్సులు స్టేడియం అవతల పడుతున్నాయి. మైదానంలో పడిన బంతిని ప్రేక్షకులు తిరిగి ఇచ్చేస్తున్నా.. గ్రౌండ్ బయట పడిన బంతులను మాత్రం కొందరు ఎత్తుకెళుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు చాలానే జరిగాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం నవ్వులు పూయిస్తోంది. తన స్థలంలో పడిన బంతిని ఇవ్వనని ఓ ల్యాండ్ ఓనర్ మొండికేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం చెపాక్ సూపర్ గిల్లీస్, సీచెమ్ మదురై పాంథర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెపాక్ బ్యాటింగ్ సందర్భంగా ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. మదురై బౌలర్ మురగన్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ నాలుగో బంతికి చెపాక్ బ్యాటర్ ప్రదోష్ పాల్ భారీ షాట్ ఆడాడు. బంతి డీప్ మిడ్ వికెట్ పై నుంచి ఏకంగా స్టేడియం బయట పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి బాల్ తీసుకున్నాడు. బంతి నా స్థలంలో పడిందని, నేను ఎందుకు ఇవ్వాలని అన్నాడు. బాల్ ఇవ్వకుండా వెళ్లి.. మంచంలో కూర్చోని మరో వ్యక్తితో సరదాగా కబుర్లు చెప్పుకున్నాడు. ఈ దృశ్యాలను మ్యాచ్ కెమెరామెన్ రికార్డ్ చేశాడు. దాంతో స్టేడియంలో ఉన్న వాళ్లు సరదాగా నవ్వుకున్నారు.
Also Read: IND vs SL: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. మూడో టీ20 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!
ఆ వ్యక్తి బంతిని ఇవ్వకపోవడంతో అంపైర్లు కొత్త బాల్‌ను తెప్పించారు. కొద్దిసేపు ఆగిన మ్యాచ్ కొత్త బంతి రాకతో ఆరంభం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ సంఘటనపైఫాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వ్యక్తి కావాలనే చేశాడని, పాపులర్ అయ్యేందుకు ఇదంతా చేశాడని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో వీడియో చూస్తే అస్సలు నవ్వాగదు.
A must watch moment in TNPL. 😀👌
– Peak gully cricket vibe when an outsider took the ball & not giving it back…!!! pic.twitter.com/N5iah4NmUT
— Johns. (@CricCrazyJohns) July 29, 2024