గత బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఏపీ చెందిన సాయితేజ లాన్స్ నాయక్‌గా విధులు నిర్వహిస్తున్న కూడా మరణించిన విషయం తెలిసిందే. అయితే డీఎన్‌ఏ పరీక్ష ఆధారంగా నిన్న సాయితేజ మృతదేహాన్ని గుర్తించి ఆర్మీ అధికారులు ఢిల్లీ నుంచి బెంగళూరు తరలించారు. సాయితేజ పార్థీవదేహం తరలింపు ఆలస్యంతో బెంగళూరు బేస్ క్యాంపులోనే ఉంచారు. ఈ రోజు ఉదయం బెంగళూరు బేస్ క్యాంపులో నివాళులు అర్పించిన అనంతరం సాయితేజ పార్థీవదేహాన్ని ఎగువరేగడలోని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అయితే ఎగువరేగడ సాయితేజ భౌతికకాయం వచ్చే దారిలో భారీ ఎత్తున్న ప్రజలు పూలు చల్లుతూ ఘన నివాళులు అర్పించారు. అంతేకాకుండా సాయితేజ కుమారుడు తన తండ్రి లవ్‌య్యూ డాడీ అంటూ ఫోటోకు ముద్దులు పెడుతున్న సన్నివేశం అక్కడున్న వారిని కలిచివేసింది. ప్రజల సందర్శనార్థం ప్రస్తుతం సాయితేజ పార్థీవదేహం ఉంచనున్నారు. అనంతరం ఎగువరేగడలోనే సాయితేజ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.