ఈరోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆదరగొట్టింది కేకేఆర్ జట్టు. 93 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగ్గిన కోల్‌కతా జట్టు ఒక్క వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ గిల్(48) పరుగులు చేసి చివర్లో చాహల్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(41) పరుగులతో జట్టుకు కేవలం 10 ఓవర్లలోనే విజయాన్ని అందించాడు. అయితే ఆర్సీబీ బౌలర్లు ఈ స్వల్ప లక్షాన్ని కాపాడే ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యారు.
ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఆర్సీబీ జట్టులో 22 తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా దేవదత్ పడిక్కల్ నిలిచాడు. ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ అందరూ కనీస పరుగులు చేయలేకపోవడంతో… జట్టు 92 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది.