టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అవును… టీమిండియా జట్టు లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ఈ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్… త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన చిన్న నాటి ప్రెండ్, ప్రియురాలు మిట్టాలీ పరూల్కర్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు శార్దూల్ ఠాకూర్. ముంబై లోని తన నివాసం లో అతి కొద్ది మంది ఆత్మీయ బంధువుల మధ్య ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్…. ఎంగేజ్ మెంట్ చేసేసుకున్నాడు.
అయితే.. ఈ ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమానికి తన కుటుంబ సభ్యులతో పాటు… టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ, ముంబై రంజీ సహచరులు ధవల్ కులకర్ణి, అభిషేక్ నాయర్, ఠాకూర్ పాత స్నేహితులు హాజరయ్యారు. కాగా… ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఆడిన శార్దూల్ ఠాకూర్…ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.