‘డేటింగ్, ఎఫైర్, రిలేషన్ షిప్, లవ్’… ఇలా పేర్లు ఎన్ని పెట్టుకున్నా… అన్నిటికి మూలం ‘ఆకర్షణ’! అది ఉన్నంత కాలం వేడివేడి ఫాస్ట్ ఫుడ్ లాగా ఘుమఘుమలాడుతుంది వ్యవహారం! కానీ, ఒక్కసారి బ్రేకప్ అయితే ఒకప్పటి వంటకం పాచి పోయి కంపుకొట్టే అవకాశాలే ఎక్కువ! అందుకే, విడిపోయాక కూడా ‘గుడ్ ఫ్రెండ్స్’లాగా ఉండే ఎక్స్ లవ్వర్స్ చాలా చాలా తక్కువ!
బాలీవుడ్ లో ఎఫైర్లు ఎంత కామనో, బ్రేకప్ లు కూడా అంతే సాధారణం. అయితే, ఒకసారి ఎవరి దారి వారు చూసుకున్నాక మళ్లీ తమ ఎక్స్ గురించి ఎలాంటి ఎక్స్ ప్లనేషన్ ఇవ్వటానికి కూడా బీ-టౌన్ సెలబ్స్ ఇష్టపడరు. షాహిద్ కపూర్ మాత్రం ఇందుకు మినహాయింపు! ఆ మధ్య ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు… ఒకే స్టేట్మెంట్ లో కరీనా, ప్రియాంక ఇద్దర్నీ మెన్షన్ చేసేశాడు!
కరణ్ జోహర్ అడిగిన ఓ ప్రశ్నకి బదులిస్తూ “కరీనాతోగానీ, ప్రియాంకతోగానీ నా రిలేషన్ షిప్ వల్ల నేను ఎంతో నేర్చుకున్నాను. ఆ అనుభవాలు, జ్ఞాపకాలు అన్నిటి వల్లే నేను ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నాను. అందుకే, నేను కరీనా, ప్రియాంక ఇద్దరిలో ఎవరికి సంబంధించిన జ్ఞాపకాలు కూడా మనసులోంచి తొలగించుకోవాలని అనుకోవటం లేదు!’’ అన్నాడు. అంతా బాగానే ఉందిగానీ… మాటల సందర్భంలో షాహిద్ అసలు విషయం బయట పెట్టేశాడు! అంత వరకూ కరీనాతో, ప్రియాంకతో తన సంబంధం గురించి ఎక్కడా ఒప్పుకోలేదు మిష్టర్ కపూర్. కానీ, కరణ్ జోహర్ షోలో జరిగింది మొత్తం జాతీయ ఛానల్ సాక్షిగా ఒప్పేసుకున్నాడు. బెబో, పీసీ కూడా తమ ఎక్స్ లవ్ ఎఫైర్స్ ని ఒప్పుకోక తప్పని స్థితి తెచ్చిపెట్టాడు!
‘కాఫీ విత్ కరణ్’ షోలో షాహిద్ తన ఎక్స్ రోమాంటిక్ ఎఫైర్స్ ని అఫీషియల్ గా అంగీకరించక ముందే… కరీనా, ప్రియాంకతో ‘కబీర్ సింగ్’ కహానీలు పబ్లిక్ సీక్రెట్స్! అయితే, షాహిద్ స్వయంగా ఓకే చేయటం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది! అతడిలా ఎక్సెస్ గురించి ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడేవారు కొందరే ఉంటారు!

