భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ లో గెలిచిన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ పై ఫోకస్ చేసింది. తొలి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగగా.. రెండో వన్డే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఇప్పటికే టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు పోటీ పడ్డారు. అయితే ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకులు సృష్టించే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ నివేదిక ద్వారా తెలుస్తోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.
Also Read: TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు.. కస్టడీకి 9మంది నిందితులు
పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా దక్షిణ ఒడిశా వరకూ, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ వరకు మరొక ద్రోణి ప్రభావంతో అకాల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం (మార్చి 19) జరిగే భారత్ – ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ కు వర్షం ఆటంకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న దానిపై సందిగ్దత నెలకొంది. డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో ఇప్పటికే టిక్కెట్లన్నీ ఆన్ లైన్ లో ఆఫ్ లైన్ లో అమ్ముడుపోయాయి.
Also Read: Bhatti Vikramarka: కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర.. ఆదివాసీల సమస్యలపై..
ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. ఈ నెల 17 ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో గెలిచిన భారత జట్టు.. సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సిరీస్‌ను చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో బరిలోకి దిగనుంది. రెండో వన్డే ఆదివారం రోజు విశాఖపట్నంలో జరపాలని నిర్ణయించారు. ఈ మ్యాచ్ కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టిక్కెట్ల విక్రయం కూడా పూర్తైంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో జరిగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డేలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పునరాగమనం చేయనున్నాడు. అయితే, మ్యాచ్ జరిగే రోజు విశాఖలో భారీ వర్షం పడే అవకాశం ఉంది.
Also Read: Naatu Naatu Song: పెళ్లిలో షారూఖ్ దంపతులు ఏం చేశారంటే..
కాగా, ఈ ఏడాది భారత జట్టు ఇప్పటివరకు వరుసగా ఏడు వన్డేలను గెలుచుకుంది. వాతావరణ సూచన అందరిలో ఆందోళనను పెంచింది. ఇప్పుడు దీని ప్రకారం రెండో వన్డేలో వర్షం విలన్‌గా మారితే టీమిండియా విజయ రథం ఇక్కడితో ఆగిపోవచ్చు. విశాఖపట్నంలో ఆదివారం దాదాపు రెండున్నర నుంచి మూడు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. పగటిపూట భారీ వర్షం కురిస్తే మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖపట్నంలోని ఈ మైదానంలో డ్రైనేజీ వ్యవస్థ బాగానే ఉంది. కొన్ని గంటలు మాత్రమే వర్షం పడితే, నేల ఎండిన తర్వాత ఆట ప్రారంభించవచ్చు. కానీ ఎక్కువసేపు వర్షం కురిస్తే మ్యాచ్‌పై ప్రభావం చూపుతుంది.