ఇండోనేషియాలోని జావా ద్వీపంలో సెమెరు అగ్నిపర్వతం ఇటీవలే బద్దలైంది. సెమెరు పర్వతం బద్దలవ్వడంతో ఆ పర్వతం వచ్చిన బూడిద సుమారు 11 కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఈ పర్వతం దగ్గరలో బెసుక్ కొబొకన్ నది ఉన్నది. ఈ నది మొత్తం ఇప్పుడు బూడిద కుప్పలా మారిపోయింది. అంతేకాదు, ఈ ఆగ్రపర్వతానికి దగ్గరలో ఉన్న గ్రామాలు సైతం బూడిదతో కప్పబడ్డాయి. సెమెరు పర్వతానికి ఎటువైపు చూసినా కనుచూపు మేరలో బూడిద తప్పించి మరేమి కనిపించడం లేదు.
Read: జియో మరో కీలక నిర్ణయం… రూపాయికే…
దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వగా, వైరల్‌గా మారాయి. అగ్నిపర్వతం పేలుడు కారణంగా సుమారు 48 మంది మృతి చెందగా, పదివేల మందిని గ్రామాల నుంచి ఖాళీచేయించారు. 11 కిలోమీటర్ల మేర పేరుకుపోయిన బూడిదను పూర్తిగా తొలగించాలంటే చాలా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.