మూడో రాజకీయశక్తి వస్తుందా? ముద్రగడ వ్యూహమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజకీయం మారుతోందా? మూడో రాజకీయశక్తి వైపు అడుగులు పడుతున్నాయా? టీడీపీ, వైసీపీలకు పోటీగా మరో రాజకీయ ప్రత్యామ్నాయం రాబోతోందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. గోదావరి తీరం నుంచి కొత్త రాజకీయ పవనాలు వీస్తున్నాయి. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో రాష్ట్రంలో మూడో రాజకీయశక్తిని తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆదివారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో బీసీ, ఎస్.సి నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉభయ తెలుగు రాష్ర్టాల శెట్టిబలిజ కన్వీనర్ కుడిపూడి సూర్యనారాయణ, మాల మహానాడు నేత ఆర్.ఎస్.రత్నాకర్ అంతర్గత సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని విశ్లేషకులు అంటున్నారు.
Also Read
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
ఒకవైపు చలి, మరోవైపు ఏపీలో రాజకీయం స్తబ్ధుగా వున్న వేళ ఒక్కసారిగా వేడి రాజుకుంది. కాపు ఉద్యమనేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభాన్ని ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో బీసీ, దళిత సంఘాల నాయకులు కలుసుకున్నారు. గత కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉద్యమాలకే పరిమితమైన ముద్రగడను ఒక్కసారిగా ఇరు సామాజిక వర్గాల నాయకులు ముద్రగడను ఈయన స్వగృహంలో కలుసుకోవడం చర్చనీయాంశం అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రజా చరిష్మా ఉన్న నాయకుడు ముద్రగడను కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
వీరందరి కలయికకు కారణం ఏమై ఉంటుందన్న దానిపై హాట్ టాపిక్ అవుతోంది. ముద్రగడను కలిసేందుకు శెట్టి బలిజ సామాజిక వర్గం నుండి కుడుపూడి సూర్యనారాయణను, దళిత సామాజిక వర్గం నుండి ఆర్.ఎస్ రత్నాకర్ వచ్చారు వీరిరువురిని ఉద్యమ నేత ముద్రగడ ఆప్యాయంగా అక్కున చేర్చుకుని వీరి రాకకు గల కారణాలను తెలుసుకున్నారు. వీరంతా ఓ.సి బి.సి ఎస్.సి కులాలకు చెందిన నాయకులు కావడంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు ఏమైనా పావులు కదుపుతున్నారా అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి.
ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లోనే అపార రాజకీయ మేధావైన ఉద్యమనేత ముద్రగడను అంత తేలిగ్గా ముగ్గులోకి దింపడo వీరిరువురికీ సాధ్యమయ్యే పనేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం వున్నా.. ముద్రగడ నేతృత్వంలో రాష్ట్రంలో మూడో రాజకీయ శక్తిని తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమావేశం అనంతరం నేతలు మీడియా ముందు వెల్లడించారు. ఈ సమావేశంపై ఇతర పార్టీల నేతలు కూడా కూపీలాగినట్టు సమాచారం.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!