కేరళలో వివాదంగా మారిన ‘చీర’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలోని మహిళలు చీరకట్టు అంటే ఎంతో ఇష్టం. అది మన సంప్రదాయానికి సూచిక కూడా. అయితే కేరళలో చీరకట్టు అంశం వివాదం రేపుతోంది. ఆ రాష్ట్రంలో మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని పలువురు టీచర్లు కేరళ విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు స్పందించారు. టీచర్లు తప్పనిసరిగా చీరలు ధరించాలనే పద్ధతి సరికాదని పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఆడవారి వ్యక్తిగత అభిప్రాయమని.. ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదని విద్యాసంస్థల యాజమాన్యాలపై మంత్రి బిందు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: మన తిరుమలకు అరుదైన గుర్తింపు
Also Read
ఒక టీచర్‌కు అనేక బాధ్యతలు ఉంటాయని… అయితే ఇటువంటి పాత, వాడుకలో లేని ఆలోచనలకు కట్టుబడి ఉండటం ఆ బాధ్యతలలో ఒకటి కాదని మంత్రి బిందు వ్యాఖ్యానించారు. మరొకరి దుస్తుల ఎంపికను విమర్శించే, జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని బిందు స్పష్టం చేశారు. తాను మంత్రిని మాత్రమే కాక ఓ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నానని.. తాను కాలేజీకి చుడీదార్లు వేసుకువెళ్తున్నానని తెలిపారు. ఈ మేరకు మహిళా టీచర్లు చీర ధరించడం తప్పనిసరి కాదని ప్రభుత్వం ఓ సర్క్యులర్ జారీ చేసింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!