చీటింగ్ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చీటింగ్ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నానక్‌రాంగూడలోని సర్వే నెంబర్ 104లో శ్రీధర్ రావుకు ఐదు ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన అంశంలో మమ్మల్ని మోసం చేశాడంటూ రాయదుర్గం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ భూమి అమ్మకం జరిగినప్పుడు తమకు రావాల్సిన అమౌంట్ ఇవ్వకుండా మోసం చేశాడని, డబ్బులు అడిగితే గన్మెన్లను చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడని, చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.
కొందరికి నిర్మాణం పూర్తయిన ఫ్లాట్ లను అప్పగించ లేదు. మరికొందరితో పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా చంపుతామని బెదిరింపులకు దిగడం. భూమి అమ్మకాలు జరిపినప్పుడు ఏజెంట్లకు ఇవ్వాల్సిన కమిషన్ ఇవ్వకుండా చంపుతామని బెదిరించడం. నానక్‌రాంగూడ సర్వే నెంబర్ 104/3 లో 5 ఎకరాలు అమ్మిన విషయంలో కమీషన్ ఇవ్వలేదంటూ మహేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
Also Read
రాయదుర్గం పాన్ మక్తా సర్వే నెంబర్ 83 పార్టు లో కట్టిన కమర్షియల్ బిల్డింగ్ లో ఐటీ కంపెనీ స్పేస్ కోసం 11 కోట్లు చెల్లించిన బాధితులు… ఇప్పటి వరకు తమకు హ్యాండోవర్ చేయలేదని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, బెంగళూరు లలో సెల్లార్ వర్క్ చేస్తే డబ్బులు ఇవ్వలేదని మరో వ్యక్తి ఫిర్యాదు. ఇలా గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి పోలీసు స్టేషన్ లలో ఇప్పటి వరకు ఏడుగురు బాధితులు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!