చీటింగ్ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నానక్‌రాంగూడలోని సర్వే నెంబర్ 104లో శ్రీధర్ రావుకు ఐదు ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన అంశంలో మమ్మల్ని మోసం చేశాడంటూ రాయదుర్గం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ భూమి అమ్మకం జరిగినప్పుడు తమకు రావాల్సిన అమౌంట్ ఇవ్వకుండా మోసం చేశాడని, డబ్బులు అడిగితే గన్‌మెన్‌లను చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడని, చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. కొందరికి…