Salaar Teaser : ‘సలార్’ టీజర్ వచ్చేసింది..ఏం మాస్ రా మామా.. డార్లింగ్ ఫ్యాన్స్ కు పూనకాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఆదిపురుష్ విఫలం చెందడంతో సలార్‌పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమా తెరకెక్కించాడు.. ఊరమాస్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తుండటం తో ఫ్యాన్స్ లో రెట్టింపు ఉత్సహం తో ఉన్నారు..
సలార్ టీజర్ టైం ను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు డార్లింగ్ ను చూద్దామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న సలార్ సినిమా ప్రభాస్‌కు సరిగ్గా సరిపోతుందనేది అంచనా. అందుకే సలార్ సినిమాపై ఇప్పుడు అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి..తాజాగా టీజర్ రిలీజ్ అయ్యింది.. ప్రభాస్ మాస్ లుక్ లో అదరగోట్టారు.. కే. జీ. ఎఫ్ మించిన యాక్షన్ ఇందులో ఉన్నట్లు టీజర్ లో చూపించారు.. టీజర్ లో డార్లింగ్ దుమ్ము దూళిపాడు..ఇక టీజర్ లో.. KGF ని మించి మాస్, యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్టు చూపించారు. KGF లో హీరోకి ఇచ్చినట్టే ఇక్కడ కూడా ప్రభాస్ గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. ఇక సలార్ సినిమా కూడా రెండు పార్టులుగా ఉండబోతున్నట్టు ప్రకటించారు. సలార్ పార్ట్ 1 ceasefire అని టీజర్ చివర్లో వేశారు. మొత్తానికి ఈ టీజర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది.. సినిమా సూపర్ హిట్ అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హంగామా చేస్తున్నారు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. దీని తర్వత NTR 31 మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కంప్లీట్ కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా జూన్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.. ప్రశాంత్ నీల్ ఈ సినిమా కంప్లీట్ చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది.పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యి ఈ సినిమా థియేటర్స్ లోకి రావడానికి మరో ఆరు నెలలకి పైగా టైం పడుతుంది..అప్పటివరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఏది ఏమైనా సలార్ టీజర్ మాత్రం ఇంటర్నెట్ షేక్ చేస్తుంది.. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!