పవన్ వ్యాఖ్యలపై మాట్లాడను.. ఆ స్థాయికి దిగజారను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా టికెట్ల ఆన్లైన్ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది.. ఆ తర్వాత ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. పోసాని కృష్ణ మురళి కూడా ఘాటుగా స్పందించాడు.. వీటి అన్నింటికీ కలిపే అదేస్థాయిలో మళ్లీ కౌంటర్ ఎటాక్ చేశారు పవన్.. అయితే, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడి నేను ఆ స్థాయి దిగజారదలుచుకోలేదంటూ కామెంట్ చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. కానీ, మూడు, నాలుగు నెలలకోసారి రాష్ట్రానికి వచ్చి షో చేసి వెళితే లాభం ఉండదంటూ ఎద్దేవా చేసిన ఆయన.. కెమెరా, యాక్షన్ అన్నట్లు ఉంటుంది ఆయన వ్యవహారం అని.. ఎవరో వస్తున్నారని ఉలిక్కిపడి ఏదో చేయాల్సిన అవసరం మాకు లేదని.. వాళ్లు అలా భ్రమల్లో ఉంటే ఏం చేయలేమన్నారు.
ఇక, ఒక గుంత కనిపించగానే ఫోటోలకు ఫోజులు ఇవ్వాలనుకుంటే మేం ఆహ్వానిస్తాం అంటూ సెటైర్లు వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. మీడియాలో చర్చలకు, ప్రచారానికి పరిమితం అవ్వాలనుకుంటున్నట్టుగా ఉంది వారి వ్యవహారమన్న ఆయన.. చంద్రబాబు హయాం కంటే చాలా మెరుగ్గా రోడ్ల నిర్మాణం, నిర్వహణ ఈ ప్రభుత్వం చేస్తోందన్నారు.. అయినా, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాట్లాడి ఆ స్థాయికి దిగజారదలుచుకోలేదని ఎద్దేవా చేశారు. ఈ కాలు కుంటి ఆ కాలు కుంటి లాంటివి ఈ జతకట్టడాలు.. ఎవరో ఒకరి మద్దతు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేని స్థితిలో వాళ్లు ఉన్నారని.. వైఎస్ జగన్ సమర్ధత వల్ల మేం ప్రజల విశ్వాసం పొందగలుగుతున్నామన్నారు. ఇక, జనసేన, టీడీపీ కలిసి పోటీచేసే ఆలోచనలో ఉన్నారేమో.. అలాంటి వార్తలు కూడా వస్తున్నాయన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Also Read
- Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
- Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- Delhi: చాట్‌జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
తాజావార్తలు
-
Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
-
CJP Protests: షాకింగ్.. సీజేపీ నిరసనల్లో 2,500 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు!
-
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్లో ఎమోషన్స్.. రూ.12 కోట్ల ఓపెనింగ్ నుంచి గౌరీ ప్రియపై ప్రశంసల వరద
-
SpaceX Starship Flight 13: స్టార్‌షిప్ ఫ్లైట్ 13తో చరిత్ర.. 20 ఉపగ్రహాలు కక్ష్యలోకి, హిందూ మహాసముద్రంలో స్ప్లాష్‌డౌన్
-
Team India: ఐపీఎల్ సీజన్ మొత్తం ఫిట్.. టీమిండియాలోకి రాగానే గాయాలు.. బీసీసీఐకి కొత్త తలనొప్పి!
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!