సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ కు చికిత్స అందిస్తున్న అపోలో వైద్యులు మరో గుడ్ న్యూస్ అందించారు. ఇప్పటికే సాయి తేజ్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగా.. వైద్యానికి ఆయన స్పందిస్తున్నాడు అంటూ వైద్యులు తెలియజేయడంతో కుటుంబ సభ్యులతో పాటుగా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో కొద్దిసేపటికి క్రితమే డాక్టర్లు ఆయన్ను స్పృహలోకి రప్పించే ప్రయత్నం చేశారు. స్పృహలోకి వచ్చిన సాయితేజ్ నొప్పిగా ఉందంటూ ఒకే ఒక మాట మాట్లాడారు. తేజ్ కు అంతర్గతంగా ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు తెలిపారు. కాలర్ బోన్ కు శస్త్రచికిత్స అవసరమైన అది పెద్ద సమస్య కాదని.. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. వెంటిలేషన్ మీద చికిత్స చేస్తున్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.