ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ కు వచ్చి అదరగొట్టింది. అయితే ఆ జట్టు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ తో తన మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో అతనికి తోడుగా జడేజా కేవలం 15 బాల్స్ లో 32 పరుగులు బాదేశాడు. దాంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి 189 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తేవాటియా మూడు వికెట్లు, చేతన్ సకారియా ఒక్క వికెట్ తీశారు. అయితే ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి వస్తుంది. రాజస్థాన్ ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం చాలా కీలకం. కాబట్టి ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలని రాయల్స్ చూస్తున్నారు. కానీ చెన్నై పైన 190 పరుగుల లష్యని ఛేదించడం అంటే అంత సులువు కాదు. కానీ రాజస్థాన్ దానిని చేసి ప్లే ఆఫ్ రేస్ లో ఉంటుందా.. లేదా అనేది చూడాలి మరి.