ఈ మధ్యే చిల్లర కష్టాలకు చెక్‌పెడుతూ.. చార్జీల రౌండప్ పేరుతో భారీగా వడ్డించిన తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పుడు మరోసారి ప్రయాణికులకు షాక్ ఇస్తూ మళ్లీ చార్జీలను పెంచింది. డీజిల్ సెస్ పేరుతో అదనంగా ప్రయాణికులపై భారం వేసింది.. ఇక నుంచి బస్సు సర్వీసుల్లో కనీస ధర రూ.10గా నిర్ణయించింది టీఎస్ఆర్టీసీ.. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో రూ. 2 చొప్పున చార్జీలు పెరగనుండగా.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ. 5 చొప్పున వడ్డించారు… ఇక, పెంచిన చార్జీలు రేపటి నుంచే అమల్లోకి రానున్నట్టు ప్రకటించింది ఆర్టీసీ…
Read Also: Madhu Yashki: బీజేపీ-టీఆర్ఎస్ కలిసి డ్రామాలు..
ఈ మధ్యే దాదాపు రూ.5 వరకు చార్జీలు పెరిగాయి.. ఇప్పుడు మళ్లీ చార్జీలు పెరగనుండడంతో.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.. కాగా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముగిసిన తర్వాత.. దేశవ్యాప్తంగా పెట్రో చార్జీలు పెరుగుతూ పోతున్నాయి.. రెండు వారా వ్యవధిలోనే లీటర్ డీజిల్ ధర ఏకంగా రూ.10పైగానే పెరిగింది.. డీజిల్ ధరల భారం పడుతుండడంతో.. ఇక, ఆ భారాన్ని ప్రజలపై మోపింది ఆర్టీసీ.