Car Launches: ఫిబ్రవరిలో కొత్త కార్ల దండయాత్ర.. MG మెజెస్టర్ నుంచి నిస్సాన్ టెక్టన్ రిలీజ్ అయ్యే టాప్-5 కార్స్
- ఫిబ్రవరి 2026లో కొత్త కార్ల దండయాత్ర..
- కొత్త SUVలు, ఎలక్ట్రిక్ కార్ల విడుదలకు రెడీ..
- MG మెజెస్టర్ నుంచి నిస్సాన్ టెక్టన్ రిలీజ్ అయ్యే టాప్-5 కార్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Launches: ఫిబ్రవరి 2026 మాసంలో భారత ఆటోమొబైల్ రంగం దూకుడు ప్రదర్శిస్తుంది. BMW, MG, Nissan, Volkswagen, VinFast వంటి ప్రముఖ కార్ల బ్రాండ్లు ఈ నెలలో తమ కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ లాంచ్‌లలో ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రీమియం SUVలు, గ్లోబల్ మోడల్స్ ఉన్నాయి. మాస్-మార్కెట్ నుంచి లగ్జరీ సెగ్మెంట్ వరకు ఉన్న ఈ లైనప్‌లో దాదాపు ప్రతి వర్గానికి చెందిన వినియోగదారుడికి సరిపోయే ఆప్షన్స్ ఉండనున్నాయి.
Read Also: Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్‌గాంధీ ప్రసంగంపై రగడ.. మైక్ కట్ చేసిన స్పీకర్
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
MG Majestor SUV:
JSW MG Motor India తన కొత్త ఫ్లాగ్‌షిప్ SUV MG Majestorను ఫిబ్రవరి 12వ తేదీన భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రకారం, ఈ SUV డిజైన్ పరంగా విదేశాల్లో విక్రయిస్తున్న Maxus D90 నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. ఈ SUVలో పెద్ద గ్రిల్, స్కిడ్ ప్లేట్స్‌తో రగ్డ్ బంపర్, హుడ్ వెంట స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్స్, DRLs ఉన్నాయి. మస్క్యులర్ బానెట్, 20 ఇంచుల అలాయ్ వీల్స్, వెడల్పైన ఫెండర్ ఫ్లేర్స్ ఈ వాహనానికి బలమైన, భారీ లుక్‌ను అందిస్తున్నాయి.
BMW X3 30 xDrive M Sport Pro:
భారత మార్కెట్లో BMW ఫిబ్రవరి 16న కొత్త X3 30 xDrive M Sport Pro వేరియంట్‌ను విడుదల చేయనుంది. ఇది భారత్‌లో X3 సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన మోడల్ గా నిలవనుంది. ఈ SUVలో 2.0 లీటర్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కి 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ని జత చేశారు. ఇది 258 హెచ్‌పీ పవర్, 400 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ని అందించారు.
Nissan Tekton:
భారత మార్కెట్లో తన కొత్త వ్యూహాన్ని అమలు చేసే దిశగా Nissan India అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఫిబ్రవరి 4వ తేదీన కొత్త మిడ్-సైజ్ SUV Nissan Tektonను పరిచయం చేయబోతుంది. ఈ SUV, ఇటీవల లాంచ్ అయిన Renault Dusterకు బ్రదర్ మోడల్‌గా ఉండనుంది. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తక్కువ వేరియంట్లలో ప్రస్తుతం Nissan Magniteలో ఉన్న 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ను కూడా ఇవ్వవచ్చని అంచనా. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో పాటు భవిష్యత్తులో హైబ్రిడ్ వేరియంట్ కూడా రావచ్చని సమాచారం.
Read Also: 169 కి.మీ రేంజ్, 6.7kW పీక్ పవర్తో ఈవీ మార్కెట్లో అడుగుపెట్టిన Yamaha EC-063
Volkswagen Tayron R-Line:
Volkswagen Tayron R-Line ఫిబ్రవరి 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది భారత్‌లో Volkswagen ప్రీమియం మూడు లైన్ల SUV సెగ్మెంట్ కి తిరిగి ఎంట్రీ ఇవ్వనుంది. Tiguan R-Line పైన బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఇది నిలవనుంది. Tiguan ఆధారంగా రూపొందించిన ఈ 7-సీటర్ SUVకు స్ట్రెచ్ చేసిన బాడీ, షార్ప్ స్టైలింగ్, కనెక్టెడ్ LED లైటింగ్, మోడ్రన్ డిజైన్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఈ SUVలో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 201.2 bhp పవర్, 320 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ తో పాటు ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. 0 నుంచి 100 కిమీ వేగాన్ని కేవలం 7.3 సెకన్లలో చేరుకోగా, గరిష్ట వేగం 224 కిలో మీటర్లుగా ఉంది.
VinFast Limo Green:
వియత్నాం ఆటోమేకర్ VinFast గతంలో భారత్‌లో ప్రదర్శించిన Limo Green SUVను ఫిబ్రవరి 2026లో లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే ధృవీకరించింది. ఇది 7-సీటర్ SUVగా మార్కెట్లోకి రానుంది. ఈ SUV డిజైన్ VF6, VF7 మోడళ్ల డిజైన్ DNAను కొనసాగిస్తుంది. ముందు భాగంలో క్లిన్, మినిమలిస్ట్ లుక్‌తో పాటు వాహనం వెడల్పునా విస్తరించిన DRLs ఉంటాయి. ఇవి మధ్యలో కలిసి VinFast లోగో దగ్గర ప్రత్యేకమైన ‘V’ ఆకారాన్ని రూపొందిస్తాయి. వెర్టికల్ హెడ్‌ల్యాంప్స్ ఈ డిజైన్‌కు ఆధునిక ఆకర్షణను జోడిస్తున్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో మస్క్యులర్ క్లాడింగ్‌తో SUV తరహా స్టాన్స్ కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!