CM Chandrababu: మంత్రులు, సీనియర్ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. జాగ్రత్త.. వైసీపీ ట్రాప్‌లో పడొద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ మంత్రులు, సీనియర్ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వారి ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేస్తోందన్న చంద్రబాబు.. వైసీపీ నాయకులు చేసిన తప్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ పడకూడదని సూచించారు.
Read Also: Sanjay Raut: అజిత్ పవార్ మరణంపై ఏదో సందేహం కలుగుతోంది.. దర్యాప్తు చేయాలన్న సంజయ్ రౌత్
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసే బాధ్యత మంత్రులు, సీనియర్ నేతలపై ఉందని సీఎం స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించేలా నాయకులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి ఎక్కడా రాకూడదని హెచ్చరించారు చంద్రబాబు.. పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని చంద్రబాబు పేర్కొన్నారు. గత 20 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, ఏపీకి భారీగా పెట్టుబడిదారులు వస్తున్నారని తెలిపారు. ఈ అభివృద్ధి వైసీపీకి నచ్చడం లేదని, అందుకే దాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే ప్రయత్నాలను ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు.
మరోవైపు.. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడా టీడీపీ మంత్రులు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే వైసీపీ ప్లాన్‌ను ప్రజలు ఇప్పటికే తిరస్కరిస్తున్నారని నేతలు వ్యాఖ్యానించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే వైసీపీ నేతలు బూతు పురాణం ఎత్తుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతల కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోవద్దని టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నేతలకు సూచించారు. మొత్తంగా రాష్ట్ర శాంతిభద్రతలు, అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని నేతలు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!