Site icon NTV Telugu

Robert Vadra: ల్యాండ్ డీల్ కేసులో క్లీన్ చిట్.. నిజాయితీగా పనిచేశానన్న సోనియా అల్లుడు

Robert Vadra

Robert Vadra

ల్యాండ్ డీల్ కేసులో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాబర్ట్ వాద్రా సంస్థ రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కు భూమిని బదలాయించడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి తెలిపింది. ఈ నేపత్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా భర్త సుదీర్ఘ ఫేస్‌బుక్ పోస్ట్‌లో సంతోషంగా ఉన్నానని అన్నారు. “నేను ఎప్పుడూ నిజాయితీగా పనిచేశాను,కష్టపడి అభివృద్ధి చెందాను. కానీ బిజెపి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తోంది. వారి ఏజెన్సీలు నా కంపెనీలపై దాడులు చేశాయి. వారు నన్ను రోజుల తరబడి ప్రశ్నించారు, 100ల నోటీసులు పంపారు, చట్టవిరుద్ధమైన పన్ను డిమాండ్‌లు చేశారు. నా ఆస్తులను అటాచ్ చేస్తారు. 20,000 డాక్యుమెంట్‌లకు పైగా తీసుకుంటారు. నేను పూర్తిగా సహకరిస్తూనే ఉన్నాను. నన్ను అడిగిన మొత్తం సమాచారాన్ని అందిస్తూనే ఉన్నాను ”అని వాద్రా పోస్ట్‌లో తెలిపారు.

వ్యాపారాన్ని నిర్వహించడం, అన్ని పన్నులు చెల్లించడం వంటి చట్టబద్ధమైన పద్ధతులకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు. తన వ్యాపార లావాదేవీల్లో ఎలాంటి తప్పుడు పనులు జరగలేదని హర్యానా ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన నివేదికలో ఆశాకిరణం కనిపించడం ఆనందంగా ఉంది అని వాద్రా చెప్పారు. ఇది మరెవరికీ జరగదని నేను ఆశిస్తున్నానని, ప్రతీకార రాజకీయాల పద్ధతి దేశానికి విషపూరితం అని వాద్రా వ్యాఖ్యానించారు.
Also Read:Ice Cream Crime: ఐస్‘క్రైమ్’ స్టోరీ.. బాలుడు మృతి.. కేసులో షాకింగ్ నిజాలు

కాగా, వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ డిఎల్‌ఎఫ్‌కు భూమిని బదిలీ చేయడంలో ఎలాంటి నియమాలు లేదా నిబంధనలను ఉల్లంఘించలేదని హర్యానా ప్రభుత్వం బుధవారం పంజాబ్, హర్యానా హైకోర్టుకు తెలిపింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, వాద్రా మరికొందరిపై 2018 సెప్టెంబర్‌లో గురుగ్రామ్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో దర్యాప్తు ముడిపడి ఉంది. అయితే, ఈ డీల్ సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల రికార్డును హర్యానా పోలీసులు పరిశీలిస్తున్నారు. భూమి లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నుహ్ నివాసి సురీందర్ శర్మ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే, ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తాము ఎప్పుడూ తప్పు చేయలేదని మాజీ సీఎం హుడా, వాద్రా పేర్కొన్నారు.

Exit mobile version