అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. గత రెండున్నరేళ్లలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆస్తులు విపరీతంగా పెరిగిపోయాయని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన ‘సుడిగాడు’ చిత్రంలో పెరిగినట్టు తోపుదుర్తి ఆస్తులు పెరిగాయని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే తోపుదుర్తి తనదైన రీతిలో మరోసారి కౌంటరిచ్చారు.