అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతోంది. పరిటాల-తోపుదుర్తి మాటలతో వేడెక్కిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టీడీపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలో వందల కోట్ల భూఆక్రమణ చేశారు. ఇందుకు రెవెన్యూ అధికారులు సహకరించారు.. కొన్ని ఫోర్జరీ సంతకాలతో చేశారన్నారు. ఈమేరకు సంచలన విషయాలను బయటపెట్టారు. ఎక్స్ ఆర్మీ, వంక పరంబోకు, అసైన్డ్ ల్యాండ్ భూములను చట్ట బద్ధత చేసి కాజేశారు. వీటిపై ఇటీవల ఆధారాలతో…
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. గత రెండున్నరేళ్లలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆస్తులు విపరీతంగా పెరిగిపోయాయని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన ‘సుడిగాడు’ చిత్రంలో పెరిగినట్టు తోపుదుర్తి ఆస్తులు పెరిగాయని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే తోపుదుర్తి తనదైన రీతిలో మరోసారి కౌంటరిచ్చారు.