భారత్ – పాకిస్థాన్ మధ్య ఏరియాజు జరగనున్న మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ పై కొన్ని విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ మ్యాచ్ పై యోగా గురు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈరోజు భారత్-పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్ జాతీయ ప్రయోజనాలకు, అలాగే రాష్ట్ర ధర్మానికి విరుద్ధమని అని అన్నారు. అయితే ప్రస్తుతం ఎల్ఓసి లో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే ఈ రెండు దేశాల జట్ల తలపడుతున్న మ్యాచ్ పై కొంత వ్యతిరేకత ఉంది. అయితే ఈ మ్యాచ్ గురించి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మాట్లాడుతూ… ఇది ఒక్క మాములు మ్యాచ్… మిగితా జట్లతో ఆడిన విధంగానే అని సీజెబుతున్నారు. కానీ బయట వాతావరణం చూస్తుంటే మాత్రం ఎవరికీ అలా అనిపించదు. ఇక ఇప్పటివరకు ప్రపంచ కప్ లలో ఒక్కసారి కూడా పాకిస్థాన్ పై ఓడిపోని భారత్ ఈ రోజు కూడా ఆ విజయాపథాని కొనసాగిస్తుందా… లేదా అనేది చూడాలి.