బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించింది.. తెలుగులో చేసిన ఒక్క సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.. ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. కమర్శియల్ యాడ్ లలో ఎక్కువగా కనిపిస్తుంది.. అదేవిధంగా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యేవో చూస్తూనే ఉన్నాం.. ఇక తాజాగా శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది..
శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా ట్విటర్‌లో పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ‘మేము విడిపోయాం.. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి’ అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు.. దానికి గుండె ముక్కలైన ఎమోజీతో పాటు చేతులు జోడిస్తున్న గుర్తును జత చేశాడు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన ఈ ట్వీట్ చేశాడు.. అది చూసిన జనాలు అస్సలు మీకేమైంది.. ఇదంతా నిజామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరికొందరు మాత్రం ఆయన విడిపోతుంది తన భార్యతో కాదు మాస్క్‌తో అని అభిప్రాయపడుతున్నారు. కాగా 2021లో నీలిచిత్రాల కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా కొంతకాలంపాటు జైలు జీవితం గడిపాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియాకు తన ముఖం చూపేందుకు కూడా ఇష్టపడలేదు.. ఎప్పుడూ బయటకు వచ్చినా కూడా అతడు మాస్క్ పెట్టుకొని బయటకు వస్తాడు..
ఇదిలా ఉండగా.. అతడు తన జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. యూటీ 69 అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీలో రాజ్‌కుంద్రాయే ప్రధాన పాత్రలో నటించాడు. కాగా చాలాకాలంగా మాస్క్ చాటున ముఖం దాచుకుంటున్న అతడు యూటీ 69 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్క్ తీసేసి మీడియా ముందు నిలబడ్డాడు. బహుశా మాస్క్‌తో ఇక సంబంధం లేదని ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది.. వీరిద్దరూ 2009 లో పెళ్లి చేసుకున్నారు.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు..
We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔
— Raj Kundra (@onlyrajkundra) October 19, 2023