ఐకాన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. బన్నీ నటించిన.. పుష్ప సినిమా 5 వ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రేపు పుష్ప సినిమా విడుదల కానున్న నేపథ్యంలోనే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 17 వ తేదీ నుంచి… ఈ నెల 30 వ తేదీ వరకు అంటే.. దాదాపు రెండు వారాల పాటు… పుష్ప సినిమా 5 వ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు అధికారిక జీవో ను జారీ చేసింది కేసీఆర్ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో… ఈ మూవీ నిర్మాణ సంస్థకు భారీగానే లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక కేసీఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం తో.. బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఏపీలోనూ ఈ నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా.. రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్లలో పుష్ప సినిమా విడుదల కానుంది.