ఇద్దరు సైన్య అధికారుల మధ్య ఆధిపత్య పోరాటంతో సూడాన్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారం కోసం ఇద్దరు నేతలు చేస్తున్న పోరాటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సూడాన్ లో సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య పోరు సాగుతూనే ఉంది. కాల్పులు, పేలుళ్ల మోతతో అనేక ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. సూడాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను ఆకస్మిక తరలించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ప్రధాని మోడీ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుడాన్‌లో పరిస్థితి సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
Also Read:CM JaganMohan Reddy: ఈ స్టాంపింగ్ విధానంతో ప్రయోజనాలెన్నో!
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సూడాన్‌లో భారత రాయబారి రవీంద్ర ప్రసాద్ జైస్వాల్, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ సూడాన్‌లో ఇటీవలి పరిణామాలను అంచనా వేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 3,000 మందికి పైగా భారతీయ పౌరుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రత్యక్ష నివేదికను పరిశీలించారు. గత వారం విబుల్లెట్‌తో ఒక భారతీయుడు మరణించడం పట్ల ప్రధాన మంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు. అప్రమత్తంగా ఉండాలని, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, సూడాన్‌లోని భారతీయ పౌరుల భద్రతను నిరంతరం పర్యవేక్షించాలని ప్రధాని ఆదేశించారు. వారికి సాధ్యమైన అన్ని సహాయాలను అందించాలని ప్రధాని మోదీ అధికారులను సూచించారు.
Also Read:Seediri Appala Raju: మా రాష్ట్రం గురించి పక్క రాష్ట్రం వాళ్ళకి ఎందుకు?
ఈరోజు తెల్లవారుజామున, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సూడాన్‌లో అధ్వాన్నమైన పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో చర్చించారు. సుడాన్‌లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. పారామిలిటరీ బలగాల మధ్య జరిగిన పోరులో 300 మందికి పైగా మరణించారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు దొరక్క, కటిక నేలపై నిద్రిస్తూ ఎప్పుడే తూటా తమ ప్రాణాల్ని హరిస్తుందో తెలీయని పరిస్థితుల్లో ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూడాన్‌లోని భారతీయులకు భారత దౌత్య కార్యాలయం ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది.