సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వం వహించిన సోషల్ మెసేజ్ డ్రామా “రిపబ్లిక్”. తాజాగా ఈ సినిమా నుంచి “రిపబ్లిక్” ట్రైలర్ ను రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా మెగాస్టార్ “సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష” అంటూ ట్వీట్ చేశారు.
సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2021
Launching the trailer :https://t.co/mdA3ILcZld@IamSaiDharamTej
ఈ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ లో సాయి ధరమ్ తేజ్, రమ్య కృష్ణ పోషించిన పాత్రల మధ్య రాజ యుద్ధం కన్పిస్తోంది. యువ ఐఏఎస్ అధికారిగా సాయి ధరమ్ తేజ్, మరోవైపు రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన మహిళ మధ్య న్యాయం కోసం జరిగే పోరాటం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్ మొదట్లో “సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలే బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే… కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థే వాళ్ళకు కొమ్ము కాస్తోంది” అంటూ చెప్పే డైలాగ్ మొదలు అన్ని డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. ప్రజాస్వామ్య శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ… ఈ మూడు అంశాలను ప్రధానంగా చేసుకుని తెరకెక్కుతోంది “రిపబ్లిక్”.
Read Also : ప్రభాస్ తో పూజా హెగ్డే క్లాష్… అసలు విషయం ఏమిటంటే ?
ఈ సోషల్ డ్రామా అక్టోబర్ 1న గాంధీ జయంతి వారాంతంలో విడుదల కానుంది. దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ నటించారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. సెప్టెంబర్ 9న కేబుల్ బ్రిడ్జిపై జరిగిన యాక్సిడెంట్ కారణంగా తేజ్ తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. ఆయన ఆసుపత్రి బెడ్ పై ఉన్నప్పటికీ సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేకర్స్. తేజ్ కు అపోలో ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.