అది అందమైన దీవి. ఇటలీలోని వెనీస్ నగరానికి కూతవేటు దూరంలో ఓ చిన్న దీవి ఉంది. ఈ దీవిపేరు పోవెగ్లియా. దీనికి అర్ధం సుందరమైన దీవి అని. కానీ, ఇటలీ ప్రజలు మాత్రం ఈ దీవిని దెయ్యాల దిబ్బగా పిలుస్తారు. ప్రజలు నివాసానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, అక్కడ దీవిలోకి అడుగుపెట్టాలంటే గుండెలు జారిపోతాయి. అడుగడుగున భయంతో వణికిపోతారు. దీని వెనుక చాలా పెద్ద కారణం ఉన్నది. 16 వ శతాబ్దంలో ఇటలీలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఈ ప్లేగు వ్యాధి కారణంగా ఇటలీలో సుమారు లక్ష మంది చనిపోయారు. అయితే, ప్లేగు వ్యాధి వ్యాపించిన సమయంలో వ్యాధి సోకిన రోగులను పోవేగ్లియాలో పడేసేవారు. అక్కడ వారికి ఎలాంటి చికిత్స అందేది కాదు. భయంకరమైన నరకాన్ని అనుభవిస్తూ ఆ దీవిలోనే మరణించారు. అందుకే ఆ దీవికి భూలోక నరకం అనే పేరు వచ్చింది. 1920 తరువాత ఆ దీవిని టూరిస్ట్ ప్రాంతంగా మార్చాలని ప్రయత్నం చేసినప్పటికీ వెనీస్ నగరం వరకు వచ్చిన ప్రజలు పోవేగ్లియాలో అడుగుపెట్టేవారు కాదట.