భారత ప్రధాని నరేంద్ర మోడీ కారును అప్‌గ్రేడ్ చేస్తున్నారు.. మెర్సిడెస్-మేబ్యాక్ S 650 కారులో ప్రయాణం చేయనున్నారు ప్రధాని.. రేంజ్ రోవర్ నుంచి మెర్సిడెస్ బెంజ్‌కు రేంజ్ మార్చారు. సెక్యూరిటీ రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుండగా.. బుల్లెట్లు, పేలుళ్లు సంభవించినా సురక్షితంగా ఉండేలా ఈ కారును డిజైన్ చేశారట.. ఇక, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ కారు విలువ రూ.12 కోట్ల రూపాయలకు పైమాటేనని… రెండు మీటర్ల దూరంలో 15కేజీల టీఎన్టీ బ్లాస్ట్ జరిగినా.. ప్రొటెక్ట్ చేయగలదు.. అంతే కాకుండా దీని బాడీ డైరక్ట్ ఎక్స్ ప్లోజన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుందని… గ్యాస్ అటాక్ జరిగితే కారులో సపరేట్ ఎయిర్ సప్లై కూడా అరేంజ్ చేశారంటూ.. ఇలా ఆ కారు ప్రత్యేకతలపై రకరాల కథనాలు వచ్చాయి.. అయితే, ఈ కారు ధరను మీడియాలో రూ.12 కోట్లుగా పేర్కొనడంపై కేంద్రం వర్గాలు స్పందించాల్సి వచ్చింది.
Read Also: ఆటో రైడ్‌పై జీఎస్టీ.. న్యూఇయర్‌లో తొలి రోజు నుంచే వడ్డింపు..!
మీడియాలో ప్రధాని కొత్త కారు ధర రూ.12 కోట్లుగా చూపించడంపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాయి ప్రభుత్వ వర్గాలు.. ప్రధాని కొత్త కారు ధరను మీడియాలో ఎక్కువ చేసి చూపించారని ఆరోపించాయి. మీడియా పేర్కొన్న దాని కంటే ఆ కారు ధర తక్కువని.. ఆ ధరలో మూడింట ఒక వంతు ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.. ఇక, ప్రధాని గతంలో బీఎండబ్ల్యూ కారు ఉపయోగించారని, అయితే ఆ మోడల్ కార్ల తయారీని బీఎండబ్ల్యూ నిలిపివేయడంతో, ఆయన భద్రత దృష్ట్యా మెర్సిడెస్ కొనుగోలు చేసినట్టు క్లారిటీ ఇచ్చాయి… అత్యున్నత స్థాయి ప్రముఖులకు భద్రత కల్పించే ఎస్పీజీ ప్రమాణాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క కారును ఆరేళ్లకు మించి ఉపయోగించరాదని కేంద్రం వర్గాలు స్పష్టం చేశాయి. ఇక, అదే కారు కావాలంటూ ప్రధాని మోడీ నుంచు ఎలాంటి సలహాలు కానీ, సూచనలు కానీ రాలేదని పేర్కొన్నాయి కేంద్ర వర్గాలు.