మొన్న మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఇవాళ వాటికి సంబంధించిన ఆధారాలంటూ కొన్ని పత్రాలను మీడియా ముందు బయటపెట్టారు.. సహచరులపై అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ చెప్పారన్న ఆయన.. అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించనని గతంలో ఇద్దరు మంత్రులపై వేటు కూడా వేశారని గుర్తుచేశారు. మంత్రి మల్లారెడ్డిపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న రేవంత్.. తాను మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలిచ్చానని పేర్కొన్నారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన వ్యవహారంలో మల్లారెడ్డిని కేసీఆర్ ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. 50 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యవహారంలో మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మల్లారెడ్డిపై విచారణకు కేసీఆర్ సాహసించలేదని తప్పుబట్టారు. అవినీతి పాల్పడితే కొడుకైనా.. కూతురైన కటకటాల వెనక్కి పోవాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పారు.. రాజయ్యను బర్తరఫ్ చేశారు.. ఈటలపై ఫిర్యాదులు వచ్చాయని తొలగించారు.. మరి మంత్రి మల్లారెడ్డిపై విచారణ ఎందుకు జరపడంలేదని ప్రశ్నించారు.
50 ఎకరాల లే అవుట్ చేసిన వ్యాపారిని బెదిరించిన మల్లారెడ్డి ఆడియో బయటకు వచ్చింది.. సీఎం మాత్రం విచారణకు ఆదేశాలు కూడా ఇవ్వలేదన్నారు రేవంత్‌రెడ్డి.. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల అమ్ముకున్న ఆడియోలు బయటకు వచ్చాయి.. మల్లారెడ్డి యూనివర్సిటీ భూములు.. 650 సర్వే లో 1965కి స్బందించిన పహని బయట పెడుతున్న.. గుండ్ల పోచంపల్లి ఊర్లో 22 ఎకరాల 8 గుంటల భూమి ఉంది.. 2000_01 పహానిలో విభజన జరిగి 22 ఎకరాల 8 గంఉటల భూమి ఉన్నట్టు పహనీ ఉంది.. ఈ భూమి.. కేసీఆర్ ధరణి వెబ్‌సైట్ వచ్చిన తర్వాత 33 ఎకరాల 26 గుంటలు ఎలా అయ్యిందో చెప్పాలని డిమాండ్ చేశారు.. ఒక సర్వే నెంబర్ లో భూమి ఎలా పెరిగింది అని ప్రశ్నించిన రేవంత్.. 16 ఎకరాలు శ్రీనివాస్ రెడ్డి పేరుతో భూమి బదిలీ అయ్యిందని.. మల్లారెడ్డి బావ మరిది దీనికి యజమాని ఎలా అయ్యాడు? అని నిలదీశారు.. శ్రీనివాస్ రెడ్డి నుండి మల్లారెడ్డి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కి 16 ఎకరాలు గిఫ్ట్ డిడ్ అయ్యిందని బయటపెట్టిన రేవంత్.. శ్రీనివాస్ రెడ్డి… 16 ఎకరాల భూమికి యజమాని ఎలా అయ్యాడో వివరాలు లేవన్నారు.. ఇక, 2004లో గ్రామపoచాయతీ అనుమతితో లే అవుట్లు చేసింది కూడా 650 సర్వే నెంబర్ భూమి అని.. జీహెచ్‌ఎంసీ అయ్యాక మళ్లీ అమ్మకానికి పెట్టారన్నారు.. మంత్రి వర్గంలో సచ్చిలుడు ఉంటారు అంటున్నారు కదా.. మరి, మల్లారెడ్డి యూనివర్సిటీ భూములు ఎలా వచ్చాయో చెప్పాలి అని డిమాండ్ చేశారు.. మరోవైపు.. జవహర్ నగర్ లో 488 సర్వే నెంబర్‌లో 5 ఎకరాల భూమి ఉంది.. ఇది రిజిస్ట్రేషన్ లను నిషేధిత సర్వే నంబర్.. ఐదెకరాల ప్రభుత్వ భూమి అని అధికారులు బోర్డు పెట్టారు.. ఇదే భూమిలో సీఎంఆర్ ఆస్పత్రులు వచ్చాయన్నారు. ఇది మల్లారెడ్డి కోడలు శాలిని రెడ్డి పేరుతో ఉందంటూ పత్రాలు బయటపెట్టారు. జవహర్ నగర్ లో ఉన్న ఐదెకరాల ప్రభుత్వ భూమిలో రిజిస్ట్రేషన్ నిషేధించిన తర్వాత భూమి ఎలా బదిలీ అయ్యింది? అని ప్రశ్నించారు. నిషేధిత భూముల్లో సేల్ డీడ్ ఎలా వచ్చింది..? నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదు..?
మల్లారెడ్డి కాలేజీకి naac గ్రేడింగ్ కోసం తప్పుడు పత్రాలు అందించారు అని లేఖ రాసిందన్నారు రేవంత్‌రెడ్డి.. ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టారని… నిషేధం పెట్టిందన్న ఆయన.. ఐదేళ్లు naac నిషేధించిన కాలేజీ యాజమాన్యానికి సీఎం కేసీఆర్.. యూనివర్సిటీ ఇచ్చారని విమర్శించారు.. గజ దొంగలను పక్కన పెట్టుకుని… కేటీఆర్ నీతులు చెప్తున్నారన్న ఆయన.. ఫీజు రీఎంబర్స్ మెంట్… లో వందల కోట్ల దుర్వినియోగం చేసిందని విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని.. ఆ నివేదిక బయట పెట్టాలని డిమాండ్ చేవారు.. మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఫోర్జరీ సర్టిఫికెట్లు పెట్టిన దొంగ మల్లారెడ్డి అన్న ఆయన.. అవినీతి ఆరోపణలు చేస్తే బయటకు పంపిస్తానన్న సీఎం కేసీఆర్.. మాట నిలబెట్టుకోవాలన్నారు. రాజయ్య, ఈటల రాజేందర్ లను తొలగించినట్లు మల్లారెడ్డి పై చర్యలు తీసుకోవాలని.. మల్లారెడ్డి అక్రమ వివరాలు పంపుతున్న చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..