మొన్న మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఇవాళ వాటికి సంబంధించిన ఆధారాలంటూ కొన్ని పత్రాలను మీడియా ముందు బయటపెట్టారు.. సహచరులపై అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ చెప్పారన్న ఆయన.. అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించనని గతంలో ఇద్దరు మంత్రులపై వేటు కూడా వేశారని గుర్తుచేశారు. మంత్రి మల్లారెడ్డిపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న రేవంత్.. తాను మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలిచ్చానని పేర్కొన్నారు. ఓ రియల్ ఎస్టేట్…