క్రిప్టో కరెన్సీ ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది. క్రిప్టో కరెన్సీలో అనేక రకాలు ఉన్నాయి. బిట్‌కాయిన్, ఇథేరియమ్, బినాన్స్, టెథర్, కార్డానో, సొలానో, ఎక్స్‌ఆర్‌పీ, పొల్కడాట్ వంటివి అనేకం ఉన్నాయి. అయితే, ఇందులో బిట్‌కాయిన్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. కాగా, ఈ బిట్‌కాయిన్ రంగంలోకి డిజిటల్ పేమెంట్ గేట్‌వే పేటీఎం కూడా ఎంటర్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నది. ఇండియాలో ప్రభుత్వం అనుమతులు ఇస్తే క్రిప్టోకరెన్సీ రంగంలోకి ఎంటర్‌కావాలని చూస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని సిద్ధం చేసుకున్నది. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీ నడుస్తుంది.
Read: అక్కడ దీపావళి అంటే టపాసులు కాల్చడం కాదు… కర్రలతో కొట్టుకోవడమే…
క్రిప్టోకరెన్సీ అన్నది పూర్తిగా డిజిటల్ కరెన్సీ కావడం, బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా నడుస్తుంది కాబట్టి దీనిపై ఎవరి అజమాయిషీ ఉండదు. ఎవరూ దీనిని మ్యానిప్యులేట్ చేయలేరు. ఇదే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. డిజిటల్ కరెన్సీని అదుపు ఎవరిచేతుల్లో ఉండదు కాబట్టి ఏ ప్రభుత్వము, ఏ సంస్థలు కూడా ఈ కరెన్సీకి బాధ్యత వహించదు. భద్రతా పరమైన చర్యలు తీసుకోలేదు. ఇక, 2020లో సుప్రీంకోర్టు క్రిప్టోకరెన్సీ తరహా లావాదేవీలను నిషేదించింది. దీనికి అనుగుణంగా ఆర్బీఐ చర్యలు తీసుకున్నది. ప్రభుత్వం అనుమతి లేదు కాబట్టి ఇండియాలో ఇప్పటి వరకు ఈ క్రిప్టోకరెన్సీ అధికారికంగా అడుగుపెట్టలేదు. అనధికారికంగా ఇందులో బడాబాబులు పెట్టుబడులు పెడుతున్నారు.