మేం ఎవరికీ భయపడం… అభివృద్ధే మాకు ముఖ్యం: పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలోని జనసేన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీలోని అన్ని జిల్లాల జనసేన అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఏపీ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని.. వీటి మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. శ్రమదానం ద్వారా రోడ్ల మరమ్మతులను జనసేన పార్టీ చేపడితే.. ప్రభుత్వం అనుసరించిన పోకడలను ప్రజలందరూ చూశారని పవన్ పేర్కొన్నారు.
Read Also: తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెంచాలి: టీఆర్ఎస్ నేత వినోద్
Also Read
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
- Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
ఏపీలో సగటు మనిషి అభివృద్ధి, తద్వారా రాష్ట్రాభివృద్ధి అనేది జనసేన పార్టీ లక్ష్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. తాము ప్రజల పక్షాన ఉన్నామని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. త్వరలో ప్రతి జిల్లాలో పర్యటనకు షెడ్యూల్స్ సిద్ధం చేస్తున్నామని పవన్ చెప్పారు. జిల్లాకు వెళ్ళినప్పుడే అక్కడ పార్టీ అంశాలపై సమగ్రంగా సమీక్షలు నిర్వహిస్తానని తెలిపారు. మరోవైపు నాదెండ్ల మనోహర్ కూడా పార్టీ జిల్లా అధ్యక్షులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ శ్రేణులను కలుపుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను ప్రభావవంతంగా నిర్వహించాలన్నారు. త్వరలో మండల అధ్యక్షులు, కమిటీల నియామకం ఉంటుందని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అభ్యర్ధులను బరిలోకి నిలపాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
-
VVS Laxman: జింబాబ్వే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్‌పై ప్రశంసల జల్లు..
-
Zimbabwe Captain: సికందర్ రజా అరుదైన రికార్డు.. రోహిత్, బాబర్లను దాటేసిన జింబాబ్వే కెప్టెన్..
-
Mohan Bhagwat : మాతృశక్తిని మర్చిపోవడమే దేశ పతనానికి కారణం
-
PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!