పాపికొండలు పిలుస్తున్నాయ్.. పద పద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి నదిలో విహారం ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. అందులోనూ పాపికొండల అందాలకు ముగ్ధులవ్వని పర్యాటకులు వుండరు. చాలాకాలంగా పాపికొండలకు వెళ్ళాలనుకునేవారికి నిరాశే కలిగింది. అయితే పరిస్థితులు మారడంతో ప్రభుత్వం పాపికొండల టూర్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి నుంచి పాపికొండల సందర్శనకు పర్యాటకులకు అనుమతి మంజూరు చేసింది.
రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభం అవుతున్నాయి టూరిజం బోట్లు. రాజమండ్రి నుంచి వర్చువల్ గా పాపికొండల బోట్లను ప్రారంభించనున్నారు టూరిజం మంత్రి అవంతి శ్రీనివాసరావు. పాపికొండల విహారయాత్ర పర్యవేక్షణకు ఐదు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ప్రతి పర్యాటక బోట్లకు ఎస్కార్ట్ బోట్ తప్పని సరిచేసింది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా నడిచే బోట్లకు కళ్ళెం పడింది.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్

రెండేళ్ల కిందట కచ్చులూరు ఘటన తీవ్రవిషాదం నింపింది. దీంతో యాత్ర నిలిచిపోయింది. ఈ ఏడాది పునఃప్రారంభించారు. వరదల కారణంగా కొంతకాలం ఆగిన పాపికొండలు విహారయాత్ర ఆదివారంనుంచి ప్రారంభం అవుతోంది. దీంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పాపికొండల యాత్రకు వెళ్లాలంటే ఏపీ టూరిజం ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా టికెట్లు తీసుకోవాలి. సొంత వాహనాలు లేని సందర్శకులు రాజమహేంద్రవరం సరస్వతీఘాట్‌లో ఉన్న పర్యాటక శాఖ కార్యాలయానికి ఉదయం 6.30కు చేరుకోవాలి. పర్యాటకులను అక్కడినుంచి గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ వరకు వాహనంలో తీసుకెళ్తారు. యాత్ర అక్కడినుంచే మొదలవుతుంది.
యాత్ర ఎలా సాగుతుందంటే..
పాపికొండల యాత్ర అంటే ఎంతో ఆసక్తి. ప్రతి ఒక్కరూ ఈ యాత్రకు వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతారు. ఉదయం అల్పాహారం, బోటులోనే మధ్యాహ్న భోజనం అందిస్తారు. బోటింగ్ చివరి పాయింట్ పేరంటాలపల్లి. అక్కడ అరగంట విరామం ఇస్తారు. తిరిగి అదే మార్గంలో గండిపోచమ్మ కంట్రోల్‌రూమ్‌కు బోటు చేరుకుంటుంది. అక్కడినుంచి పర్యాటకులను తిరిగి ఉదయం ప్రారంభమైన ఏపీ టూరిజం కార్యాలయానికి సాయంత్రం ఏడింటికి చేరుస్తారు.
టికెట్ ధరలు…
పెద్దలకు రూ.1250, పిల్లలకు రూ.1050. ఈ టికెట్ ధరలోనే అల్పాహారం, భోజనం, సాయంత్రం స్నాక్స్ అన్నీ కలిపి వుంటాయి. తెలంగాణ నుంచి వచ్చే పర్యాటకులు పోచవరం కంట్రోల్‌పాయింట్ ద్వారా పాపికొండలు విహారయాత్రకు వెళ్లవచ్చు. పాపికొండలు యాత్రకు టికెట్ల కోసం aptdc.in ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. సరాసరి టికెట్లు కొనాలంటే వివిధ ప్రాంతాల్లో ఏపీటీడీసీ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. పర్యాటకశాఖతో పాటు ప్రైవేటువి కలిపి మొత్తం 11 బోట్లకు అనుమతులిచ్చారు.
పర్యాటక శాఖ 40 మంది ప్రయాణికులు వెళ్లడానికి వీలుగా సర్ ఆర్ధర్‌కాటన్ బోటు అందుబాటులో ఉంది. త్వరలో 90 సీట్ల సామర్థ్యమున్న హరిత బోటు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. పర్యాటకులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు, సిబ్బంది సూచించిన విధంగా వ్యవహరించాలి. మీకూ పాపికొండలు చూడాలని వుందా.. పదండి మరి.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!