చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసింది. ఒప్పో ఫైండ్ ఎన్ పేరుతో ఈ పోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను డిజైన్ చేసింది. ఈ మొబైల్ ను ఈరోజు లాంచ్ చేశారు. శాంసంగ్ ఫోల్డబుల్ మొబైల్ కంటే తక్కువ ధరకే ఈ మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.92 వేల నుంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒప్పో ఫైండ్ ఎన్ స్మార్ట్‌ఫోన్ 33 వాట్ సూపర్ ఫ్లాష్ టెక్నాలజీతో పనిచేస్తుంది.
Read: రష్యాకు మరో హెచ్చరిక…ఉక్రెయిన్‌పై దాడికి దిగితే…
ఈ ఫ్లాష్ ఛార్జ్‌తో 30 నిమిషాల్లో 55 శాతం, 70 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. 7.1-అంగుళాల లోపలి డిస్‌ప్లే, 5.49-అంగుళాల ఔటర్ డిస్‌ప్లే, క్వాలకం స్నాప్‌డ్రాగన్ 888, 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్ సిస్టమ్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థం కలిగిఉంటుంది.