*భద్రాద్రిలో శ్రీరామ పట్టాభిషేకం.. పోటెత్తిన భక్తజనం
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారాముల వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఆలయ అర్చకులు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవం నిర్వహిస్తారు. కల్యాణం నిర్వహించిన మిల మండపంలోనే ఈ క్రతువు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అధికారులు వెల్లడించారు. రాములోరి పట్టాభిషేకం కోసం దేశంలోని నలుదిక్కులకు వెళ్లి నదులు, సముద్రాలు, సరస్సుల నుంచి వైదిక సిబ్బంది పుష్కర జలాలను తీసుకొచ్చారు. ఈ శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకంలో పాల్గొనేందుకు గవర్నర్ తమిళిసాయి నిన్న రాత్రి భద్రాద్రికి వెళ్లారు. భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం కొత్తగూడెం వరకు రైలులో వెళ్లి అక్కడి నుంచి గవర్నర్ రోడ్డులో భద్రాచలం చేరుకున్నారు. గూడెం రైల్వే స్టేషన్‌లో గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలతో అధికారులు స్వాగతం పలికారు. తమిళిసై వెంట రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. విశ్వమంతా ఆదర్శంగా కీర్తించే సీతారాముల వివాహ వేడుక గురువారం భద్రాచలంలో భక్తులకు ఆద్యంతం వీనుల విందుగా సాగింది. అశేష జనవాహినిలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. కాగా, ఈరోజు భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శ్రీరాముడికి పుష్కర సామ్రాజ్య మహాపట్టాభిషేక కార్యక్రమం జరగనున్న సందర్భంగా.. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి వేడుక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పుష్కర మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. భద్రాచలం లో జరుగుతున్న పట్టాభిషేక మహోత్సవానికి పోలీసులు దగ్గరుండి విజయనగరం జిల్లా నుంచి వచ్చిన అనాథలకు మిథిలా స్టేడియం ప్రవేశం కల్పించారు.. విజయనగరం జిల్లా నుంచి వాహన సౌకర్యం కల్పించి పట్టాభిషేక మహోత్సవం లో కూర్చోబెట్టారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిస్ట భద్రత ఏర్పాటు చేశారు.
*బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాం
బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధాని వ్యవహారంలో రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం బీజేపీ చేస్తుందని మండిపడ్డారు. అధికార అహంకారంతో బీజేపీబిజెపి పెట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడకుండా చేసేందుకు అనర్హత వేటు వేశారని నిప్పులు చెరిగారు. దేశంలో ప్రజాస్వామ్యంను కాపాడాలని ప్రజలను కోరుతున్నామని తెలిపారు. మోడీ పరిపాలన ను వ్యతిరేకిస్తూ ఒక BRS పార్టీ కాదు దేశంలో 17 పార్టీలు కలిసి వస్తున్నాయని జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు తప్పదు అనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీతో గొంతు కలపాలని కోరుతున్నామని తెలిపారు. బీజేపీ దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
*నిజామాబాద్ లో కలకలం.. మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో ఏం జరుగుతుంది. విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తమ ఆత్మవిశ్వాన్ని కోల్పోయి ఇలా ఆత్మహత్యలకు పాల్పడి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి మంచి భవిష్యత్తుకై ఎదగాల్సిన విద్యార్తులు ఇలా ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. చదువుకుని ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తారనే తల్లిదండ్రులు ఆశలను అడిఆశలు చేస్తూ వారికి పుట్టెడుదుఖాన్ని మిగిలిస్తున్నారు. అలాంటి మరో ఘటన నిజామాబాద్ మెడికల్ కళాశాలలో చోటుచేసుకోవడంతో విద్యార్థులకు తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న హర్ష ఘటన మరువకముందే మరో ఎం.బి.బి.ఎస్. విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. 2020 బ్యాచ్ కు చెందిన సనత్ మెడికల్ కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సనత్ పెద్ద పల్లి జిల్లాకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. MBBS మూడవ సంవ్సతరం పరీక్షలు రాసిన సనత్.. ప్రాక్టికల్ పరీక్షలకు సిద్ధమవుతుంగా సూసైడ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు నెలల కాలంలో ఇద్దరు మెడికో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులకు మెడికల్ కాలేజీ అధికారులు సమాచారం ఇచ్చారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
*దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్కరోజులోనే?
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొన్ని రోజుల ముందు వందల్లో నమోదైన కేసులు.. ప్రస్తుతం వేలల్లో నమోదవుతుండడం ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశవ్యాప్తంగా 24 గంటల్లో 3,095 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి క్రియాశీల కేసుల సంఖ్య 15,208కి పెరిగింది. కరోనా మహమ్మారి కారణంగా 24 గంటల వ్యవధిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,30,867కి పెరిగింది . కరోనాతో కేరళలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. గోవా, గుజరాత్‌లలో ఒక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. డైలీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా నమోదు కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.91 శాతంగా ఉంది. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,47,15,786)గా నమోదైంది. యాక్టివ్ కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.03 శాతం ఉండగా, జాతీయ రికవరీ రేటు 98.78 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ తెలిపింది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.41 కోట్లు (4,41,69,711) గా నమోదైంది. కరోనా మరణాలు 1.19 శాతంగా నమోదయ్యాయి. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇవ్వబడ్డాయి
*త్వరలోనే వస్తా.. అమృత్‌పాల్ సింగ్ మరో వీడియో
గత 13 రోజులుగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే ఛీప్ అమృత్ పాల్ సింగ్ మరో వీడియోను విడుదల చేశాడు. తానేమీ పరారీలో లేనని, త్వరలోనే మీ ముందుకు వస్తానని ఆయన తెలిపాడు. యూట్యూబ్ లో ప్రసారమైన వీడియోలో దర్శనమిచ్చిన అమృత్ పాల్ సింగ్ తాను ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోనని తెగేసీ చెప్పాడు. నేను తిరుగుబాటుదారుడిని.. అయినా పారిపోను.. త్వరలోనే ప్రపంచం ముందుకు వస్తా.. ప్రభుత్వానికి భయపడటం లేదు.. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి అంటూ పేర్కొన్నాడు. తాను ప్రస్తుతం ఎంచుకున్న మార్గమంతా పూర్తిగా ముళ్లతో ఉందని.. అయినప్పటికీ దృడంగా నిలబడాలని ఆ వీడియోలో తన కుటుంబ సభ్యులను ఆయన కోరాడు. అయితే అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ రాష్ట్ర పోలీసులు వేట ముమ్మరం చేశారు. గురువారం డ్రోన్ కెమెరాతో రంగంలోకి దిగారు. హోషియార్ పూర్ జిల్లాలోని మర్నాయిన్ గ్రామంలో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్ తో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం ఇదే గ్రామంలో కొందరు అనుమానితులు తమకారును వదిలేసి పారిపోయారు. వారిలో అమృత్ పాల్ సింగ్ ఉండవచ్చని పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, తాను ఎక్కడికీ పారిపోలేదు.. తొందరలోనే ప్రపంచం ముందుకు వస్తాను అంటూ అమృత్ పాల్ సింగ్ పేర్కొన్నాడు. చావంటూ నాకు భయం లేదు.. ఎవరికి నేను భయపడే ప్రసక్తి లేదు అంటూ అమృత్ పాల్ సింగ్ అన్నాడు.
*మళ్లీ గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్..
టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. యాక్సిడెంట్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ కు పంత్ దూరమయ్యాడు. అతను లేని లోటును మరో విధంగా ( జట్టుతో పాటు డగౌట్ లో అతని నెంబర్ జర్సీ ఉన్న టీషర్ట్ ధరించేలా ) తీర్చుకోవాలని ఢిల్లీ ఫ్రాంఛైజీ భావించింది. ఈ మేరకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) రంగంలోకి దిగింది. అందుకే పంత్ కు అభ్యంతరం లేకపోతే.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ హోం గ్రౌండ్ మ్యాచ్ లు అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రత్యేక ర్యాంప్ ను ఏర్పాటు చేస్తామని డీడీసీఏ తెలిపింది. ఐపీఎల్ 16వ సీజన్ పంత్ ఆడకపోయినా డగౌట్ లో అతను ఉంటే బాగుంటుందని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తుందని డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు. అందుకే మేము ఒక ఆలోచన చేశాం.. పంత్ గ్రౌండ్ లో ఉంటే కంపర్ట్ గా ఫీలవుతాడంటే అతని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. అతన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రత్యేక మెడికల్ టీం సహా ఇంటి నుంచి స్టేడియానికి తీసుకురావాడానికి ప్రత్యేక ట్రాన్స్ పోర్ట్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. పంత్ దీనికి ఒప్పుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ డగౌట్ లో అతని కోసం ప్రత్యేక ర్యాంప్ ను ఏర్పాటు చేయనుంది.
*ఏప్రిల్ 5 నుంచి ‘భగత్ సింగ్’గా మారనున్న పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 5 నుంచి భగత్ సింగ్ గా మారనున్నాడు. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో అనౌన్స్ సెకండ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ముహూర్త కార్యక్రమాలు పూర్తి చేసుకోని చాలా రోజులు అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అయిపొయింది. ఏప్రిల్ 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఈరోజు హరీష్ శంకర్ పుట్టిన రోజు కావడంతో పవన్ ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తో మరోసారి గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని పవన్ ఫాన్స్ అంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎన్నికల తర్వాతే హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు కానీ అందరికీ స్వీట్ షాక్ ఇస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్లే సమయం వచ్చేసింది.