సెప్టెంబర్ 2, గురువారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు మీరు దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఎదుటివారిని తమ మాటలతో ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు తోటివారితో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
వృషభం : ఈ రోజు మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. రాబడికి మించిన ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇసుక, క్వారీ, కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
Also Read
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు ఆభరణాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాబడికిమించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.
కర్కాటకం : ఈ రోజు మీరు బ్యాంకు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిలగవలసి వస్తుంది. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా అధికారులతో మాటపడక తప్పదు. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. కోర్టు వ్యవహారాలు, పరిష్కారమవుతాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.
కన్య : ఈ రోజు మీరు ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. కాంట్రాక్టర్లకు రావలిసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. ప్రైవేట, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదాపడతాయి.
తుల : ఈ రోజు మీరు వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఖరీదైన వస్తు కొనుగోళ్ళలో ఏకాగ్రత అవసరం. గృహంలో మార్పులు వాయిదాపడతాయి.
వృశ్చికం : ఈ రోజు స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారలలో జాగ్రత్త వహించడం అవసరం. విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారికి వ్యాపారాల లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలచుకుంటారు.
మకరం : ఈ రోజు మీరు ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన అధికమవుతాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.
కుంభం : ఈ రోజు భాగస్వామిక ఒప్పందాలు, ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలనిస్తాయి. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలోని వారికి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం.
మీనం : ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు, ఇతర చికాకులు తొలగి మాసికంగా కుదుటపడతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు తలకిందులవుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. అనుక్షణం మీ సంతానం విద్యా ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలు ఉంటాయి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!