అక్టోబర్ 20, బుధవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈరోజు ఈ రాశివారి వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు, పథకాలు స్ఫురిస్తాయి. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మంచితనం, మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. రుణం ఏ కొంతైనా తీర్చలన్న మీ లక్ష్యం నెరవేరుతుంది.
Also Read
మిథునం : ఈ రోజు మీరు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే యత్నాలు అనుకూలిస్తాయి. మీ కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. రాజకీయ, కళారంగాల్లో వారు సన్మానాలు పొందుతారు. రిప్రజెంటిమ్‌కు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలు సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఆలోచనలు పంచుకునే వారి కోసం మనసు తహతహలాడుతుంది.
సింహం : ఈ రోజు విదేశాలు వెళ్లాలనే మీ కొరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఉద్యోగస్తులకు అధికారిక పర్యటనలు, బాధ్యతలు అధికమవుతాయి. చిన్నతరహా పరిశ్రమలు, ప్రింటింగ్ రంగాల వారికి సమస్యలు తప్పవు. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్నవారు సైతం అనుకూలంగా మారతారు.
కన్య : ఈ రోజు మీరు వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో ఫలిస్తుంది.. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. కీలకమైన సమావేశాల్లో మితంగా సంభాషించండి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తాత్కాలికమేనని గమనించి శ్రమించండి అనుకున్నది సాధిస్తారు.
తుల : ఈరోజు మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఖర్చులు అదుపు చేయటం కష్టం. అనుకున్నది సాధించాలి అనే పట్టుదల పెరుగుతుంది. మీ మాటకు ఇంటా, బయటా ఆమోదం లభిస్తుంది.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో మంచిఫలితాలు సాధిస్తారు.. కుటుంబీకుల మధ్య అవగాహన అంతగా ఉండదు. ఆత్మీయుల నుంచి అందిన ఆహ్వానాలు స్త్రీలకు సంతోషం కలిగిస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు ప్రతి విషయంలోను అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. పాత మిత్రుల కలయికతో కొత్త ఉత్సాహానికి గురవుతారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు మరింతగా కృషి చేయవలసి వుంటుంది.
మకరం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు వారి పురోగతికి ఉపకరిస్తుంది. పత్రికా రంగంలోని వారి యత్నాలకు తగు ప్రోత్సాహం లేకపోవటంతో ఆసక్తి సన్నగిల్లుతుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. స్త్రీలకు దూర ప్రయాణాలలో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
కుంభం : ఈ రోజు మీరు గృహోపకరణాలు, వాహనం వంటి విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. చిట్స్, ఫైనాన్సు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రతి విషయంలోను నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు తెలియచేయండి.
మీనం : ఈ రోజు మీరు ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల విమర్శలు తప్పవు. ప్రేమ వ్యవహరాల్లో ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ రీతా దూరప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!