మేషం : ఈరోజు ఈ రాశివారి వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు, పథకాలు స్ఫురిస్తాయి. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మంచితనం, మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. రుణం ఏ కొంతైనా…