డిసెంబర్ 7, మంగళవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారు అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రిప్రజెంటేటిలకు, ఉపాధ్యాయులకు, మార్పులు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు మిశ్రమ ఫలితం. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో జాప్యం వద్దు.
వృషభం : ఈ రోజు ఈ రాశివారి ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటారు. రాజకీయనాయకులకు సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని పోస్టల్, కొరియర్ రంగాల వారికి పని భారం అధికం. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్లుగానే వాయిదా పడతతాయి. ఇతరుల మేలు కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వినియోగిస్తారు. ఆడిటర్లకు, అక్కౌంటెంట్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఉద్యోగ ప్రకటనలపై ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, పట్టుదల అధికమవుతాయి.
సింహం : ఈ రోజు ఈ రాశివారు బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. స్థిరాస్తి విక్రయంలో తొందరపాటు తగదు. వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. విద్యార్థులు తోటివారి వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
కన్య : ఈ రోజు ఈ రాశివారు వ్యాపార విస్తరణ, పరిశ్రమల స్థాపనకు యత్నాలు చేస్తారు. మీ ఆగ్రహావేశాల వల్ల వ్యవహారాలు చెడే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం సంభవం. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు.
తుల : ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్పులు రాబడికి మించటం వల్ల స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కోనక తప్పదు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. శత్రువులు మిత్రులుగా మారి సహయం అందిస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపారస్తులు ఊహించని లాభాలను సొంతం చేసుకుంటారు. రవాణా, మెకానిక్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. ధనం మితంగా వ్యయం చేయండి. ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు అధికమవుతాయి. మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారి సమర్థత, వాక్చాతుర్యం ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లకు తమ క్లయింట్స్ ధోరణి చికాకు కలిగిస్తుంది. విదేశీయత్నాల్లో ప్రయాసలకు లోనవుతారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు, సూచనలకు ఆమోదం లభిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి పనివారితో చికాకులు తప్పవు.
మకరం : ఈ రోజు ఈ రాశివారి దైనందిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు దొర్లటం వల్ల చికాకులు తప్పవు. కొత్త వ్యాపారాలు వాయిదా పడుట మంచిది. ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. ఏ విషయంలోను ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదని గమనించండి.
కుంభం : ఈ రోజు ఈ రాశివారు స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. విద్యార్థులకు ప్రతీ విషయంలోను ఏకాగ్రత, కొత్త విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కృషికి గుర్తింపు, సత్పలితాలుంటాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు, వాతావరణం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. ఉద్యోగస్తులు సేవా, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటతీరు, పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ప్రత్యర్ధులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మి ధనలాభం, ప్రయోజనకరమైన ఖర్చులేఉంటాయి.
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్కు ఇదే కీలకం..
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?