APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేస్తూ అభ్యర్థులకు శుభవార్త అందించింది. సెప్టెంబర్ నెలలో ప్రాథమిక సమాచారం అందించిన కమిషన్.. తాజాగా పూర్తిస్థాయి సమాచారంతో కూడిన ప్రకటనలను అందుబాటులోకి తెచ్చింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం ఐదు ప్రధాన నోటిఫికేషన్ల (నోటిఫికేషన్ నంబర్లు 09/2026, 14/2026, 20/2026, 21/2026, 22/2026) కింద 254 ఖాళీలను నింపనున్నారు. ఇందులో అత్యధికంగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ విభాగానికి సంబంధించి 196 ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎనలిస్ట్ గ్రేడ్-2 కింద 18 ఖాళీలు, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో 17 ఉద్యోగాలు, ఫ్యాక్టరీస్ విభాగంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కింద 12 ఖాళీలు భర్తీ కానున్నాయి. శాసనసభ వ్యవహారాల పరిధిలోని అసెంబ్లీ సర్వీసెస్‌లో ఆంగ్ల భాషా రిపోర్టర్లు 10 మంది, తెలుగు భాషా రిపోర్టర్ 1 పోస్టు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 13వ తేదీ నుంచి ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నవంబరు 2వ తేదీ రాత్రి వరకు తమ వివరాలను సమర్పించవచ్చు. దరఖాస్తు ప్రక్రియ కోసం అభ్యర్థులు ముందుగా కమిషన్ అధికారిక వెబ్సైట్ https://portal-psc.ap.gov.in/Default ద్వారా వన్ టైమ్ ప్రోఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమకు కేటాయించిన ఐడీ ఆధారంగా కావలసిన పోస్టుకు ఆన్లైన్లో దరఖాస్తు దాఖలు చేయవచ్చు.
Also Read
- Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
- Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
- Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
వివిధ రకాల పోస్టులు కావడంతో వాటికి అవసరమైన అర్హతలు కూడా భిన్నంగా ఉన్నాయి. అభ్యర్థులు తాము ఎంచుకున్న విభాగాన్ని బట్టి ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్, గణితం, అర్థశాస్త్రం లేదా కెమిస్ట్రీ సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్ లేదా పిజి పూర్తి చేసి ఉండాలి. అసెంబ్లీ రిపోర్టర్ పోస్టులకు సంబంధిత భాషా నైపుణ్యాలు ఉండటం తప్పనిసరి. సాధారణంగా కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండగా, గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే నిబంధనల ప్రకారం వర్గాల వారీగా వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
తాజావార్తలు
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?