మేషం : ఈ రోజు ఈ రాశివారు అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రిప్రజెంటేటిలకు, ఉపాధ్యాయులకు, మార్పులు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు మిశ్రమ ఫలితం. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో జాప్యం వద్దు. వృషభం : ఈ రోజు ఈ రాశివారి ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి…